Telugu Global
NEWS

పోటీకి వైసీపీ దూరం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ దృష్టంతా రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల పైనే ఉంచడం సరైనది అని ఆ పార్టీ భావించింది. అందుకే తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. నాలుగున్నరేళ్ల పరిణామాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. 2024నాటికి మాత్రం తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలంగా నిలిపేందుకు […]

పోటీకి వైసీపీ దూరం
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ దృష్టంతా రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల పైనే ఉంచడం సరైనది అని ఆ పార్టీ భావించింది. అందుకే తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.

నాలుగున్నరేళ్ల పరిణామాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. 2024నాటికి మాత్రం తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలంగా నిలిపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందని ప్రకటనలో వెల్లడించారు.

First Published:  10 Nov 2018 8:34 PM GMT
Next Story