Telugu Global
National

ఉమ్మేస్తే ఫైన్ తో పాటు శుభ్రం చేయిస్తున్నారు....

స్వచ్ఛభారత్ నినాదాన్ని తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేస్తున్నారు పూణే అధికారులు. ఇటీవల వచ్చిన మహేష్ బాబు సినిమాలోలా కఠిన శిక్షలు విధిస్తున్నారు. ఉమ్ము వేసినా జరిమానా అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆ.. ఇదంతా మాములేనని కొట్టి పారిస్తున్న వారు కూడా చాలా మంది జరిమానాలు కడుతున్నారట. రోడ్డు భద్రతా నిబంధనలు అమలు చేయడంలో పుణె, ముంబయి పోలీసులది అగ్రస్థానం. ట్రాఫిక్ నిబంధలనపై ఎంత బాగా అవగాహన కల్పిస్తారో, ఉల్లంఘించిన వారిని కూడా అంతే కఠినంగా […]

స్వచ్ఛభారత్ నినాదాన్ని తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేస్తున్నారు పూణే అధికారులు. ఇటీవల వచ్చిన మహేష్ బాబు సినిమాలోలా కఠిన శిక్షలు విధిస్తున్నారు. ఉమ్ము వేసినా జరిమానా అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆ.. ఇదంతా మాములేనని కొట్టి పారిస్తున్న వారు కూడా చాలా మంది జరిమానాలు కడుతున్నారట.

రోడ్డు భద్రతా నిబంధనలు అమలు చేయడంలో పుణె, ముంబయి పోలీసులది అగ్రస్థానం. ట్రాఫిక్ నిబంధలనపై ఎంత బాగా అవగాహన కల్పిస్తారో, ఉల్లంఘించిన వారిని కూడా అంతే కఠినంగా శిక్షిస్తారు. ఇప్పుడు ఈ కోవలోకి పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌(పీఎంసీ)కూడా వచ్చి చేరింది. నగరం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. పరిశుభ్ర పూణేగా రూపొందించడానికి సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు ఇక్కడి అధికారులు. ఇప్పటికే కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు రోడ్లపై ఉమ్మేసేవారికి ప్రాంతాన్ని బట్టి రూ.200 నుంచి 1,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

మొదట్లో ప్రజల నుంచి అంతలా స్పందన రాలేదు. దీంతో పీఎంసీ కఠిన నిబంధనలను ఆచరణలో పెట్టింది. ఎవరైతే ఉమ్మేస్తారో వారితోనే శుభ్రం చేయిస్తామని ప్రచారం మొదలుపెట్టారు. దాంతో పాటు రూ.150 జరిమానా వసూలు చేస్తున్నారు. ఈ పద్ధతి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 156మంది రోడ్ల మీద ఉమ్మేస్తూ పట్టుబడ్డారని పీఎంసీ అధికారులు తెలిపారు. బిబ్వేవాడి, ఆంధ్‌, ఎర్వాడ, కస్బా, ఘోల్‌ రోడ్‌ తదితర ప్రాంతాల్లో ఈ నిబంధన అమల్లో ఉందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

First Published:  12 Nov 2018 12:56 AM GMT
Next Story