Telugu Global
Cinema & Entertainment

ఇలియానా పై సీరియస్ గా ఉన్న రవితేజ.... కారణం అదేనా?

ప్లాప్స్ లో ఉన్న శ్రీనువైట్ల ని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు రవితేజ. అంతే కాకుండ ఈ సినిమాకి ఇలియానాని హీరోయిన్ గా పెట్టి మంచి క్రేజ్ తీసుకొని వచ్చాడు. కానీ రవితేజ ఇప్పుడు ఇలియానా పై బాగా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే గతంలో ఇలియానా క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న రోజుల్లో కూడా తను నటించే సినిమాల షూటింగ్స్ కు తప్ప ప్రమోషన్ కార్యక్రమాలకు వచ్చేది కాదు. అలా ఇలియానా తను […]

ఇలియానా పై సీరియస్ గా ఉన్న రవితేజ.... కారణం అదేనా?
X

ప్లాప్స్ లో ఉన్న శ్రీనువైట్ల ని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు రవితేజ. అంతే కాకుండ ఈ సినిమాకి ఇలియానాని హీరోయిన్ గా పెట్టి మంచి క్రేజ్ తీసుకొని వచ్చాడు. కానీ రవితేజ ఇప్పుడు ఇలియానా పై బాగా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అసలు విషయంలోకి వెళ్తే గతంలో ఇలియానా క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న రోజుల్లో కూడా తను నటించే సినిమాల షూటింగ్స్ కు తప్ప ప్రమోషన్ కార్యక్రమాలకు వచ్చేది కాదు. అలా ఇలియానా తను నటించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఆమె రావాలంటే అదనంగా పారితోషకం కూడా ఇవ్వాలనేది అగ్రిమెంట్లో రాయించుకుంటోంది ఇలియానా.

కానీ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఇలియానా క్రేజ్ తగ్గినా కూడా ఆమెను పిలిచి రవితేజ రిస్క్ చేసి తన సినిమాలో అవకాశం ఇవ్వడమే కాకుండా కోటి రూపాయల పారితోషికం వచ్చేలా సహకరించాడట. అయినా ఇలియానా ఏమాత్రం మారకుండా తన పాత స్వభావాన్ని మరోసారి చూపిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.

ఇప్పటివరకు ఈ సినిమా టీమ్ మొత్తం టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చింది కానీ, ఇలియానా కనిపించలేదు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడమే గొప్ప… మళ్ళీ ప్రమోషన్స్ కి కూడానా…. అన్నట్టు ఇలియానా బిహేవ్ చేస్తుందట. ఈ విషయం తెలుసుకున్న రవితేజ ఇలియానా పై ఫుల్ సీరియస్ గా ఉన్నాడట.

First Published:  12 Nov 2018 3:19 AM GMT
Next Story