Telugu Global
Cinema & Entertainment

గూఢచారికి సీక్వెల్

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క డైరెక్షన్ లో తెరకెక్కిన గూఢచారి సినిమా ఈ ఏడాది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందనే విషయాన్ని గూఢచారి క్లైమాక్స్ లోనే చెప్పారు. హీరోకు మరో కొత్త మిషన్ అప్పగిస్తారు. ఇప్పుడా సీక్వెల్ పై దాదాపు క్లారిటీ వచ్చేసింది. అవును.. గూఢచారికి సీక్వెల్ రెడీ చేసే పనిలో యూనిట్ బిజీ అయింది. అయితే పార్ట్-2 కి దర్శకుడు మారబోతున్నాడు. గూఢచారి సినిమా రైటింగ్ […]

గూఢచారికి సీక్వెల్
X

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క డైరెక్షన్ లో తెరకెక్కిన గూఢచారి సినిమా ఈ ఏడాది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందనే విషయాన్ని గూఢచారి క్లైమాక్స్ లోనే చెప్పారు. హీరోకు మరో కొత్త మిషన్ అప్పగిస్తారు. ఇప్పుడా సీక్వెల్ పై దాదాపు క్లారిటీ వచ్చేసింది.

అవును.. గూఢచారికి సీక్వెల్ రెడీ చేసే పనిలో యూనిట్ బిజీ అయింది. అయితే పార్ట్-2 కి దర్శకుడు మారబోతున్నాడు. గూఢచారి సినిమా రైటింగ్ లో కీ-రోల్ ప్లే చేసిన రాహుల్ పాకాల ఈ సీక్వెల్ ను డీల్ చేయబోతున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు తెలుస్తుంది.

పార్ట్-1 లో ఉన్న నటీనటులతో పాటు మరికొందరు కొత్త నటులు కూడా ఈ సీక్వెల్ లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం 2 స్టేట్స్ సినిమాతో బిజీ గా ఉన్న అడివి శేష్ త్వరలోనే గూఢచారి 2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

First Published:  12 Nov 2018 12:01 AM GMT
Next Story