Telugu Global
NEWS

జేసీకి చెక్‌.... నమస్కారం చేసి వెళ్లిపోయిన వైనం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం పార్లమెంట్‌ స్థానం నుంచి తన కుమారుడు జేసీ పవన్ కుమార్‌ రెడ్డిని బరిలో దింపాలని చాలా కాలంగా జేసీ భావిస్తున్నారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న వేళ జేసీ దివాకర్‌రెడ్డికి సీన్‌ రివర్స్‌ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. జేసీ అమరావతిలో చంద్రబాబును కలిసి మరోసారి తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని కోరారు. ఇందుకు చంద్రబాబు నుంచి ఊహించని స్పందన వచ్చింది. దీంతో జేసీ దివాకర్‌రెడ్డి కంగుతిన్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లను తప్పించేలా చేసి తన వారికి […]

జేసీకి చెక్‌.... నమస్కారం చేసి వెళ్లిపోయిన వైనం
X

వచ్చే ఎన్నికల్లో అనంతపురం పార్లమెంట్‌ స్థానం నుంచి తన కుమారుడు జేసీ పవన్ కుమార్‌ రెడ్డిని బరిలో దింపాలని చాలా కాలంగా జేసీ భావిస్తున్నారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న వేళ జేసీ దివాకర్‌రెడ్డికి సీన్‌ రివర్స్‌ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

జేసీ అమరావతిలో చంద్రబాబును కలిసి మరోసారి తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని కోరారు. ఇందుకు చంద్రబాబు నుంచి ఊహించని స్పందన వచ్చింది. దీంతో జేసీ దివాకర్‌రెడ్డి కంగుతిన్నారు.

వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లను తప్పించేలా చేసి తన వారికి అనంతపురం పార్లమెంట్ పరిధిలో టికెట్లు ఇప్పించుకోవాలని జేసీ దివాకర్ రెడ్డి భావించారు. అందులో భాగంగానే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని…. కాబట్టి అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని శింగనమల, రాయదుర్గం, అనంతపురం అర్బన్‌, గుంతకల్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని జేసీ డిమాండ్ చేస్తూ వచ్చారు.

కానీ చంద్రబాబు అనంతపురం లోక్‌సభ టికెట్‌ మీ కుమారుడికి కావాలంటే ముందు అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి వారికి అభ్యంతరం లేనట్టు లేఖలు తీసుకురావాలని ఆదేశించారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం లేదు .. వారందరినీ మార్చాలని తాను ముందు నుంచీ చెబుతున్నానని… ఇప్పుడు వారి నుంచే లేఖలు ఎలా తీసుకురావాలి అని జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబుతో వ్యాఖ్యానించారు. ఇందుకు సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలే గెలిచేపరిస్థితి లేకుంటే మరి ఏ రాజకీయ అనుభవం లేని నీ కుమారుడు ఎంపీగా ఎలా గెలుస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

జేసీ పవన్‌కు ఎంపీ టికెట్‌ ఇస్తే… తన కుమారుడికి హిందూపురం టికెట్‌ ఇవ్వాలంటూ పరిటాల సునీత కూడా డిమాండ్ చేస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తాడిపత్రి టికెట్‌ మాత్రం మిమ్మల్ని కాదని ఎవరికీ ఇవ్వబోనని… అక్కడ మీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పారు.

పెట్టిన కండిషన్‌తో పాటు… జేసీ పవన్‌కు టికెట్ ఇస్తే ఇతరులు కూడా ఇదే తరహాలో వారసులకు టికెట్లు డిమాండ్ చేస్తారని చంద్రబాబు చెప్పడంతో విషయం అర్థం చేసుకున్న జేసీ దివాకర్‌ రెడ్డి… దండం పెట్టేసి సీఎం చాంబర్‌ నుంచి బయటకు వచ్చేశారు.

First Published:  12 Nov 2018 4:21 AM GMT
Next Story