Telugu Global
Cinema & Entertainment

ఈ వార్త నిజమైతే..... ఒక రికార్డే....

సూపర్ స్టార్ట్ మహేష్ బాబు 25 వ సినిమాగా రూపొందుతున్న సినిమా “మహర్షి”. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఓ రేంజ్ లో అమ్ముడుపోయాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. హిందీ డబ్బింగ్ రైట్స్ ను దాదాపు 22 కోట్లకు అమ్మినట్లు, అమెజాన్ […]

ఈ వార్త నిజమైతే..... ఒక రికార్డే....
X

సూపర్ స్టార్ట్ మహేష్ బాబు 25 వ సినిమాగా రూపొందుతున్న సినిమా “మహర్షి”. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఓ రేంజ్ లో అమ్ముడుపోయాయని అంటున్నారు సినీ విశ్లేషకులు.

హిందీ డబ్బింగ్ రైట్స్ ను దాదాపు 22 కోట్లకు అమ్మినట్లు, అమెజాన్ ప్రైమ్ దాదాపు 12 కోట్లతో డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసినట్లే అవుతుంది.

ఇన్నేళ్ల సినీ కెరీర్లో గడ్డంతో కనిపించని మహేష్ బాబు, ఈ సినిమా కోసం న్యూ లుక్ ట్రై చేశాడు. మహేష్ కొత్త లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇటీవలే న్యూయార్క్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విలేజ్ సెట్ వేసి ఓ 25 రోజులు పాటు అక్కడ షూటింగ్ చేయనున్నారు. వైజయంతి మూవీస్ పై అశ్విని దత్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమాని కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఉగాది సంధర్బంగా రిలీజ్ కానుంది.

First Published:  12 Nov 2018 12:17 AM GMT
Next Story