Telugu Global
Cinema & Entertainment

"వాళ్లందరికీ.... మిడిల్ ఫింగర్ చూపిస్తాను" " విజయ్ దేవరకొండ

సినిమా పైరసీ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయ్యింది. ఇటీవల కాలం లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “గీత గోవిందం” సినిమా మొదటి 30 నిమిషాలు రిలీజ్ కి ముందే నెట్ లో వచ్చేసింది. దాని తరువాత మళ్ళీ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “టాక్సీ వాలా” సినిమా మొత్తం లీక్ అయ్యింది. దాదాపు మూడు గంటలకి పైగా ఉన్న సినిమా అంతా నెట్ లోకి వచ్చేసింది. ఈ విషయం తెలిసి మూవీ […]

వాళ్లందరికీ.... మిడిల్ ఫింగర్ చూపిస్తాను  విజయ్ దేవరకొండ
X

సినిమా పైరసీ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయ్యింది. ఇటీవల కాలం లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “గీత గోవిందం” సినిమా మొదటి 30 నిమిషాలు రిలీజ్ కి ముందే నెట్ లో వచ్చేసింది. దాని తరువాత మళ్ళీ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “టాక్సీ వాలా” సినిమా మొత్తం లీక్ అయ్యింది. దాదాపు మూడు గంటలకి పైగా ఉన్న సినిమా అంతా నెట్ లోకి వచ్చేసింది.

ఈ విషయం తెలిసి మూవీ యూనిట్ మొత్తం కంగారు పడ్డారు కూడా. కానీ విజయ్ దేవరకొండ మాత్రం సినిమాను అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ చేసి సినిమా పైరసీ చేసిన వాళ్లకి బుద్ది చెప్పాలి అని తన అభిమానులను కోరాడు. ఈ విషయాన్ని “టాక్సీ వాలా” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజి మీద అన్నాడు విజయ్.

సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు… ఆ వినోదం వెనక ఎంతో మంది కృషి కూడా ఉంది…. వాళ్ళ జీవితాలు కూడా ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు విజయ్. రాహుల్ సంకీర్తయన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 17 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. యువి క్రియేషన్స్ , గీత ఆర్ట్స్ వారు ఈ సినిమాని కలిసి ప్రొడ్యూస్ చేశారు.

First Published:  12 Nov 2018 12:27 AM GMT
Next Story