Telugu Global
Cinema & Entertainment

అమ్మాయిలూ... జర జాగ్రత్త అంటున్న అనుపమ పరమేశ్వరన్

ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న టాపిక్ “మీటూ”. ఏ హీరోయిన్ నోట విన్నా…. ఏ హీరోయిన్ ట్వీట్ పెట్టినా అందులో “మీటూ” ఉండనే ఉంది. ఇటీవల ఒక ప్రముఖ హీరోయిన్ దీనిపై ఫైర్ అయ్యింది. ఆమె మరెవరో కాదు అనుపమ పరమేశ్వరన్. మీటూ విషయం పై ఆమె స్పందిస్తూ ఆడవాళ్ళకి రక్షణ కావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆడవాళ్లు కూడా సందర్భాన్ని బట్టి సర్దుకుపోవాలి అని అనుపమ చెప్పారు. సినిమా ఇండస్ట్రీ లో కొంతమంది పేర్కొన్నట్టు కాస్టింగ్ […]

అమ్మాయిలూ... జర జాగ్రత్త అంటున్న అనుపమ పరమేశ్వరన్
X

ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న టాపిక్ “మీటూ”. ఏ హీరోయిన్ నోట విన్నా…. ఏ హీరోయిన్ ట్వీట్ పెట్టినా అందులో “మీటూ” ఉండనే ఉంది.

ఇటీవల ఒక ప్రముఖ హీరోయిన్ దీనిపై ఫైర్ అయ్యింది. ఆమె మరెవరో కాదు అనుపమ పరమేశ్వరన్. మీటూ విషయం పై ఆమె స్పందిస్తూ ఆడవాళ్ళకి రక్షణ కావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆడవాళ్లు కూడా సందర్భాన్ని బట్టి సర్దుకుపోవాలి అని అనుపమ చెప్పారు.

సినిమా ఇండస్ట్రీ లో కొంతమంది పేర్కొన్నట్టు కాస్టింగ్ కౌచ్ అలాంటిదేమి లేదంటూ ఆమె పేర్కొన్నారు. ఆడవారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పారు. అంతేకాకుండా తనకు తన కాలేజీ రోజుల్లో జరిగిన ఒక విషయాన్ని షేర్ చేసుకున్నారు అనుపమ.

అబ్బాయిలు అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేస్తే వారి పైన సీరియస్ అయ్యి కొట్టడం లాంటిది చేయకూడదు అన్నారు. వారికి అర్ధం అయ్యేలా చెప్తే ఎవరైనా వింటారని ఆమె పేర్కొన్నారు. వారిని కొట్టడం లాంటివి చేస్తే వారు ఇంకా రెచ్చిపోయి ఎంతకైనా తెగిస్తారని అన్నారు.

చాలా సినిమాలు చేసాను…. ఎప్పుడూ కూడా ఇలాంటి కాస్టింగ్ కౌచ్ అనేది తన వరకూ రాలేదు అని ఆమె అన్నారు. స్త్రీల పట్ల ప్రతి ఒక్క పౌరుడూ వినయ విధేయతలు కల్గి ఉండాలని అనుపమ అన్నారు.

అలా ఎవరికైనా కాస్టింగ్ కౌచ్ ఎదురైతే వారు వెంటనే చిత్ర సీమ పెద్దలను ఆశ్రయించాలని ఆమె పేర్కొన్నట్టు సమాచారం. తాను తను చేయబోయే సినిమాల పైనే బిజీగా ఉన్నానని, మిగతా విషయాలు త్వరలో వెల్లడిస్తా అని ఆమె అన్నారు.

First Published:  13 Nov 2018 4:56 AM GMT
Next Story