Telugu Global
Cinema & Entertainment

నమ్మండి.. నా మార్క్ కామెడీ మిస్ అవ్వదు

వరుసగా ఫ్లాపులొచ్చిన దర్శకుడు ఏం చేస్తాడు. కాస్త కొత్తగా ఆలోచిస్తాడు. కొత్త కథ రాసుకుంటాడు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ దర్శకుడు శ్రీనువైట్ల మాత్రం మారలేదు. తన మార్క్ కామెడీని ఎట్టిపరిస్థితుల్లో వీడేది లేదని తెగేసి చెబుతున్నాడు ఈ దర్శకుడు. “అమర్ అక్బర్ ఆంటోనీ కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు నేను ట్రై చేయని స్టోరీలైన్ ఇది. అయితే సినిమా కొత్తగా ఉంటుందని నేనేదో కొత్తగా తీశానని మాత్రం అనుకోవద్దు. సినిమాను నా […]

నమ్మండి.. నా మార్క్ కామెడీ మిస్ అవ్వదు
X

వరుసగా ఫ్లాపులొచ్చిన దర్శకుడు ఏం చేస్తాడు. కాస్త కొత్తగా ఆలోచిస్తాడు. కొత్త కథ రాసుకుంటాడు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ దర్శకుడు శ్రీనువైట్ల మాత్రం మారలేదు. తన మార్క్ కామెడీని ఎట్టిపరిస్థితుల్లో వీడేది లేదని తెగేసి చెబుతున్నాడు ఈ దర్శకుడు.

“అమర్ అక్బర్ ఆంటోనీ కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు నేను ట్రై చేయని స్టోరీలైన్ ఇది. అయితే సినిమా కొత్తగా ఉంటుందని నేనేదో కొత్తగా తీశానని మాత్రం అనుకోవద్దు. సినిమాను నా స్టయిల్ లో ఎంటర్ టైనింగ్ గానే చెప్పాను. నా మార్క్ కామెడీ ఇందులో తప్పకుండా ఉంటుంది. దుబాయ్ శీను, వెంకీ సినిమాల్లో నా కామెడీ చూసి ఎంత ఆనందించారో, ఈ సినిమాలో కూడా ఆ రేంజ్ కామెడీ ఉంటుంది. ఇది నా గ్యారెంటీ.”

ఇలా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు శ్రీనువైట్ల. వరుసగా మూడు డిజాస్టర్లు చవిచూసిన ఈ దర్శకుడు.. రవితేజ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతానంటున్నాడు. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత నెక్ట్స్ ప్రాజెక్టుపై ఆలోచిస్తానంటున్నాడు శ్రీనువైట్ల

First Published:  13 Nov 2018 10:55 AM GMT
Next Story