Telugu Global
NEWS

సెల్‌ ఫోన్లపై లోకేష్ లేటెస్ట్‌ లెక్క.... పాత లెక్కన ఆ స్టేట్‌మెంట్ ఉత్తుదే....

భాషపై, విషయంపై పట్టుసాధించేందుకు నారా లోకేష్ ఎంత ప్రయత్నిస్తున్నా… మాట బయటకు వచ్చే సరికి మాత్రం అది మిస్‌ ఫైర్ అవుతూనే ఉంది. నారా లోకేష్‌ చేసిన ఎన్నో వ్యాఖ్యలు నవ్వులపాలయ్యాయి. చివరకు నారా లోకేష్‌ రాజకీయ జీవితం పైనే అవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆ మధ్య సెల్‌ఫోన్లపై లోకేష్ చేసిన ప్రకటన చూసి అందరూ అవాక్కయ్యారు. సెల్‌ఫోన్లు తీసుకొచ్చింది తానేనని తండ్రి చంద్రబాబు చెబుతుంటే…. లోకేష్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఆ మధ్య ఒక […]

సెల్‌ ఫోన్లపై లోకేష్ లేటెస్ట్‌ లెక్క.... పాత లెక్కన ఆ స్టేట్‌మెంట్ ఉత్తుదే....
X

భాషపై, విషయంపై పట్టుసాధించేందుకు నారా లోకేష్ ఎంత ప్రయత్నిస్తున్నా… మాట బయటకు వచ్చే సరికి మాత్రం అది మిస్‌ ఫైర్ అవుతూనే ఉంది. నారా లోకేష్‌ చేసిన ఎన్నో వ్యాఖ్యలు నవ్వులపాలయ్యాయి.

చివరకు నారా లోకేష్‌ రాజకీయ జీవితం పైనే అవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆ మధ్య సెల్‌ఫోన్లపై లోకేష్ చేసిన ప్రకటన చూసి అందరూ అవాక్కయ్యారు. సెల్‌ఫోన్లు తీసుకొచ్చింది తానేనని తండ్రి చంద్రబాబు చెబుతుంటే…. లోకేష్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఆ మధ్య ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు.

దేశంలో 100 సెల్‌ఫోన్లు తయారవుతుంటే … చంద్రబాబు వచ్చాక అందులో ఒక్క ఏపీలోనే 260 సెల్‌ఫోన్లు తయారవుతున్నాయని చెప్పారు. లోకేష్ చెప్పిన లెక్కపై జోకులు పేలాయి.

కొందరు మాత్రం ఏపీలో దేశం మొత్తం కంటే ఎక్కువ సెల్‌ఫోన్లు తయారవుతున్నాయన్నది లోకేష్ భావమని సమర్ధించుకున్నారు. అయితే సెల్‌ఫోన్లపై గతంలో తాను చేసిన ప్రకటన తప్పు అని పరోక్షంగా లోకేషే అంగీకరించారు.

దుబాయ్‌లో టీడీపీ ఎన్నారైల సమావేశంలో ప్రసంగించిన నారా లోకేష్…. దేశంలో 10 సెల్‌ఫోన్లు తయారవుతుంటే అందులో మూడు సెల్‌ఫోన్లు ఏపీలో తయారవుతున్నాయని వ్యాఖ్యానించారు.

67 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు 24 ఏళ్ల కుర్రాడిలా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. మొత్తం మీద దేశంలో 100 ఫోన్లు తయారవుతుంటే ఏపీలో 260 ఫోన్లు తయారవుతున్నాయంటూ గతంలో లోకేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఉత్తుదేనన్న మాట.

First Published:  13 Nov 2018 9:28 PM GMT
Next Story