Telugu Global
Cinema & Entertainment

ఇటు రిలీజ్.. అటు ఎంజాయ్ మెంట్

మరి కొన్ని గంటల్లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా థియేటర్లలోకి వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలతో రవితేజ రెస్ట్ లేకుండా గడుపుతున్నాడు. రిలీజ్ కు సంబంధించి చిట్టచివరి పనుల్లో శ్రీనువైట్ల తలమునకలై ఉన్నాడు. ఇక నిర్మాతల సంగతి సరేసరి. ఇలా యూనిట్ లో ప్రతి ఒక్కరు నిద్ర మానుకొని పనిచేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో ఒక్కరు మాత్రం జాలీగా ఉన్నారు. ఆమె పేరు ఇలియానా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా […]

ఇటు రిలీజ్.. అటు ఎంజాయ్ మెంట్
X

మరి కొన్ని గంటల్లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా థియేటర్లలోకి వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలతో రవితేజ రెస్ట్ లేకుండా గడుపుతున్నాడు. రిలీజ్ కు సంబంధించి చిట్టచివరి పనుల్లో శ్రీనువైట్ల తలమునకలై ఉన్నాడు. ఇక నిర్మాతల సంగతి సరేసరి. ఇలా యూనిట్ లో ప్రతి ఒక్కరు నిద్ర మానుకొని పనిచేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో ఒక్కరు మాత్రం జాలీగా ఉన్నారు. ఆమె పేరు ఇలియానా

అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటించిన ఇలియానా మాత్రం తనకేం పట్టనట్టు వ్యవహరిస్తోంది. అసలు సినిమాతో సంబంధం లేదన్నట్టు ఏకంగా విదేశీ పర్యటన షురూ చేసింది. గోవా నుంచి నేరుగా ఫిజిలో ల్యాండ్ అయింది. అక్కడ స్కూబా డైవింగ్ చేస్తూ, భర్త (ప్రియుడు అని కూడా అనుకోవచ్చు) తో కలిసి ఎంజాయ్ చేస్తోంది.

సినిమాల్లో నటించడం వరకే ఇలియానా వంతు. ప్రచారానికి మాత్రం ఆమె ఎప్పుడూ దూరమే. రీఎంట్రీ ఇచ్చినా ఆమె వ్యవహార శైలి మారలేదు. నిజానికి ఆమె ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కూడా రాదనుకున్నారు. నిర్మాతలు ఎలాగోలా కష్టపడి ఆమెను తీసుకురాగలిగారు. కానీ పూర్తిస్థాయి ప్రచారంలోకి మాత్రం ఆమెను దించలేకపోయారు. ఓ సెక్షన్ మీడియాకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చి జారుకుంది ఈ గోవా బ్యూటీ.

First Published:  15 Nov 2018 7:16 AM GMT
Next Story