Telugu Global
NEWS

మహాకూటమిలో కుల ప్రకంపనలు

మహాకూటమిలో కుల సమీకరణాలు సెట్‌ కావడం లేదు. భిన్నధృవాలు కలిశాయని కాంగ్రెస్‌, టీడీపీ పెద్దలు చెప్పుకుంటున్నా, గ్రౌండ్‌ లెవల్‌లో వ్యవహారం బెడిసికొడుతోంది. రాజేంద్రనగర్‌ టికెట్‌ను టీడీపీకి కేటాయించడంపై భగ్గుమన్న కాంగ్రెస్ నేత కార్తీక్‌ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతోపాటు… రాజేంద్రనగర్‌లో టీడీపీ అభ్యర్థి ఎవరి ఓట్లతో గెలుస్తారో చూస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో కూకట్‌పల్లిలో చంద్రబాబు నడిపిన రాజకీయం రెడ్డి సామాజికవర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది. తొలుత పెద్దిరెడ్డి పేరును కూకట్‌పల్లికి ప్రకటించారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు […]

మహాకూటమిలో కుల ప్రకంపనలు
X

మహాకూటమిలో కుల సమీకరణాలు సెట్‌ కావడం లేదు. భిన్నధృవాలు కలిశాయని కాంగ్రెస్‌, టీడీపీ పెద్దలు చెప్పుకుంటున్నా, గ్రౌండ్‌ లెవల్‌లో వ్యవహారం బెడిసికొడుతోంది.

రాజేంద్రనగర్‌ టికెట్‌ను టీడీపీకి కేటాయించడంపై భగ్గుమన్న కాంగ్రెస్ నేత కార్తీక్‌ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతోపాటు… రాజేంద్రనగర్‌లో టీడీపీ అభ్యర్థి ఎవరి ఓట్లతో గెలుస్తారో చూస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో కూకట్‌పల్లిలో చంద్రబాబు నడిపిన రాజకీయం రెడ్డి సామాజికవర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది.

తొలుత పెద్దిరెడ్డి పేరును కూకట్‌పల్లికి ప్రకటించారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు వర్గం పావులు కదిపింది. కూకట్‌పల్లి టికెట్‌ను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రచారం మొదలుపెట్టిన పెద్దిరెడ్డి చేత ప్రచారాన్ని నిలిపివేయించారు.

ఇప్పుడు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి కూకట్‌పల్లి టికెట్‌ కేటాయించారు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండడంతో పెద్దిరెడ్డిని పక్కనపడేసి సుహాసినిని తెరపైకి తెచ్చారు. ప్రకటించి ఆ తర్వాత పెద్దిరెడ్డిని పక్కన పెట్టడంపై కూకట్‌పల్లిలోని రెడ్డి సామాజిక వర్గం వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అటు కాంగ్రెస్‌ పార్టీ తమను పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్‌లోని కమ్మ సామాజికవర్గం నేతలు ఊగిపోతున్నారు.

తమ ఓట్లు మహాకూటమికి, కాంగ్రెస్‌కు అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ రెండు జాబితాలను ప్రకటించగా…. కమ్మ సామాజికవర్గం వారికి ఒక్క టికెట్‌ కూడా దక్కలేదు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ ఏకంగా ఆరుగురు కమ్మ అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. దీంతో మహాకూటమి తమను నిర్లక్ష్యం చేసి అవమానించిందని కమ్మ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమ్మ సామాజికవర్గం వారికి వర్కింగ్ ప్రెసిడెంట్‌ పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు తాజాగా ప్రతిపాదించారు. అసలు ఒక్క అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని మండిపడ్డారు. టికెట్ల కేటాయింపులో కమ్మవారికి అన్యాయం జరిగిందని రేణుకా చౌదరి కూడా అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ మాత్రం తనకు దక్కిన సీట్లలో కమ్మ అభ్యర్థులకు పెద్దపీటే వేసింది.

First Published:  15 Nov 2018 6:27 AM GMT
Next Story