Telugu Global
Cinema & Entertainment

ఇది హారర్ కాదు.. పక్కా కామెడీ

టాక్సీవాలా సినిమాపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ సినిమాపై యూనిట్ లోనే రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరేమో దీన్ని హారర్ సినిమాగా చెబుతుంటే, ఇంకొందరు దీన్ని పక్కా కామెడీ సినిమా అంటున్నారు. ఓవరాల్ గా ఇదొక హారర్-కామెడీ అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. కాకపోతే హారర్ కంటే కామెడీనే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నాడు. “టాక్సీవాలా స్టోరీ విన్నప్పుడే విపరీతంగా నవ్వుకున్నాను. నా లెక్క ప్రకారం ఈ సినిమా అర్జున్ రెడ్డి తర్వాత రిలీజ్ అవ్వాలి. […]

ఇది హారర్ కాదు.. పక్కా కామెడీ
X
టాక్సీవాలా సినిమాపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ సినిమాపై యూనిట్ లోనే రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరేమో దీన్ని హారర్ సినిమాగా చెబుతుంటే, ఇంకొందరు దీన్ని పక్కా కామెడీ సినిమా అంటున్నారు. ఓవరాల్ గా ఇదొక హారర్-కామెడీ అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. కాకపోతే హారర్ కంటే కామెడీనే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నాడు.
“టాక్సీవాలా స్టోరీ విన్నప్పుడే విపరీతంగా నవ్వుకున్నాను. నా లెక్క ప్రకారం ఈ సినిమా అర్జున్ రెడ్డి తర్వాత రిలీజ్ అవ్వాలి. కానీ ఆ స్థానంలో గీతగోవిందం వచ్చింది. దాంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యా. ఇప్పుడీ సినిమాకి కిడ్స్ కూడా కనెక్ట్ అవుతారు కాబట్టి పర్పస్ ఫిల్ అవుతుందనే అనుకుంటున్నాను.”
ఇలా టాక్సీవాలా సినిమా హిలేరియస్ ఎంటర్ టైనర్ అంటున్నాడు దేవరకొండ. తన సినిమాలకు మెగాస్టార్ తో పాటు మెగాహీరోలు అతిథులుగా రావడాన్ని నమ్మలేకపోతున్నానంటున్నాడు విజయ్. ఇప్పటికీ అది కలా.. నిజమా అనే ఫీలింగ్ కలుగుతుందని చెబుతున్నాడు.
“మెగాస్టార్ సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది నా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు బన్నీ అన్న లాంటి స్టార్స్ రావడం ఏంటో, మెగాస్టార్ నా సినిమాకి అప్లాజ్ ఇవ్వడమేంటో నేనింకా షాక్ లోనే ఉన్నా. ఇదంతా రేపు నేను ముసలోడినయ్యాక చెప్పుకుని ఎంజాయ్ చేస్తానేమో”
టాక్సీవాలా రిలీజ్ అయ్యాక తన నుంచి మరో 6 నెలల పాటు ఎలాంటి సినిమాలు రావంటున్నాడు దేవరకొండ. డియర్ కామ్రేడ్ రిలీజ్ అవ్వడానికి చాలా టైం పడుతుందని చెబుతున్నాడు.
First Published:  15 Nov 2018 8:07 AM GMT
Next Story