Telugu Global
NEWS

నిత్యనూతనం సచిన్ తొలిటెస్ట్ జ్ఞాపకం

29 ఏళ్ల క్రితం ఇదేరోజున సచిన్ తొలిటెస్ట్ మ్యాచ్ 1989 నవంబర్ 15 కరాచీలో సచిన్ టెస్ట్ అరంగేట్రం పాకిస్థాన్ పై అరంగేట్రం టెస్ట్ ఇన్నింగ్స్ లో సచిన్ 15 పరుగులు క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్, భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ తన టెస్ట్ అరంగేట్రం రోజును గుర్తు చేసుకొన్నాడు. 29 సంవత్సరాల క్రితం.. ఇదేరోజున పాకిస్థాన్ గడ్డపైన కరాచీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా…16 ఏళ్ల చిరుప్రాయంలోనే సచిన్ టెండుల్కర్ టెస్ట్ […]

నిత్యనూతనం సచిన్ తొలిటెస్ట్ జ్ఞాపకం
X
  • 29 ఏళ్ల క్రితం ఇదేరోజున సచిన్ తొలిటెస్ట్ మ్యాచ్
  • 1989 నవంబర్ 15 కరాచీలో సచిన్ టెస్ట్ అరంగేట్రం
  • పాకిస్థాన్ పై అరంగేట్రం టెస్ట్ ఇన్నింగ్స్ లో సచిన్ 15 పరుగులు

క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్, భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ తన టెస్ట్ అరంగేట్రం రోజును గుర్తు చేసుకొన్నాడు. 29 సంవత్సరాల క్రితం.. ఇదేరోజున పాకిస్థాన్ గడ్డపైన కరాచీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా…16 ఏళ్ల చిరుప్రాయంలోనే సచిన్ టెండుల్కర్ టెస్ట్ క్యాప్ అందుకొన్నాడు.

1989 నవంబర్ 15న పాకిస్థాన్ తో ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ తొలిఇన్నింగ్స్ లో బాల సచిన్ …పాక్ దిగ్గజ బౌలర్లు ఇమ్రాన్ ఖాన్, వకార్ యూనస్, వాసిం అక్రంలను దీటుగా ఎదుర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో సచిన్ 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

1989 నవంబర్ 15 తర్వాత నుంచి 24 ఏళ్ల కాలం పాటు…. బాల సచిన్ కాస్త…. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ గా ఎదిగాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు మరోపేరుగా నిలిచాడు.

భారత క్రికెట్ పతాకాన్ని ప్రపంచ క్రికెట్ కోటపై రెపరెపలాడించాడు. క్రికెట్ చరిత్రలోనే మకుటంలేని మహారాజుగా నీరాజనాలు అందుకొన్నాడు.

భారతజట్టులో సభ్యుడిగా 24 ఏళ్ల పాటు ఆడిన సచిన్ 200 టెస్టుల్లో 51 సెంచరీలతో పాటు 15వేల 921 పరుగులు సాధించాడు. అంతేకాదు…. 463 వన్డేలలో 49 శతకాలతో సహా…. 18 వేల 426 పరుగులు నమోదు చేశాడు.

1989లో టెస్ట్ అరంగేట్రం చేసిన సచిన్ తన ఆఖరి టెస్ట్ మ్యాచ్ ను 2013లో విండీస్ ప్రత్యర్థిగా…. హోంగ్రౌండ్ ముంబై వాంఖెడీ స్టేడియంలో ఆడి…. క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.

29 ఏళ్ల క్రితంనాటి జ్ఞాపకాలను నెమరువేసుకొన్న సచిన్…. కొన్ని అపురూప చిత్రాలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకొన్నాడు.

క్రికెట్ ఉన్నంతకాలం వంద అంతర్జాతీయ సెంచరీల మొట్టమొదటి క్రికెటర్ గా మాస్టర్ సచిన్ టెండుల్కర్ చిరస్థాయిగా నిలిచిపోతాడు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్ ఘనతను బీసీసీఐ సైతం…. కొనియాడుతూ సందేశాన్ని పంపింది.

First Published:  15 Nov 2018 3:55 AM GMT
Next Story