Telugu Global
NEWS

కిడారి హత్య తరహాలో..... పొలంలో మాటేసిన 30 మంది

ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు హత్య తరహాలోనే ప్రజాప్రతినిధుల హత్యకు మావోయిస్టులు చేసిన యాక్షన్ ప్లాన్‌ను తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. మావోయిస్టుల కదలికలను పసిగట్టిన పోలీసులు అప్రమత్తమవడంతో వారు పారిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తాడ్వాయి మండలంలోకి మావోయిస్టులు ప్రవేశించారని తెలంగాణ ఎస్‌ఐబీ… స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు కూబింగ్‌కు వెళ్లగా పొలాల్లో దాగి ఉన్న మావోయిస్టుల టీం సభ్యులు పారిపోయారు. దాదాపు 30 మంది మావోయిస్టులు […]

కిడారి హత్య తరహాలో..... పొలంలో మాటేసిన 30 మంది
X

ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు హత్య తరహాలోనే ప్రజాప్రతినిధుల హత్యకు మావోయిస్టులు చేసిన యాక్షన్ ప్లాన్‌ను తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు.

మావోయిస్టుల కదలికలను పసిగట్టిన పోలీసులు అప్రమత్తమవడంతో వారు పారిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

తాడ్వాయి మండలంలోకి మావోయిస్టులు ప్రవేశించారని తెలంగాణ ఎస్‌ఐబీ… స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు కూబింగ్‌కు వెళ్లగా పొలాల్లో దాగి ఉన్న మావోయిస్టుల టీం సభ్యులు పారిపోయారు.

దాదాపు 30 మంది మావోయిస్టులు పొలాల్లో మాటు వేసి… పోలీసులు రాగానే వెళ్లిపోయారని గుర్తించారు. మావోయిస్టులు పొలాల్లో దాక్కునేలా సహకరించిన ఇద్దరు స్థానిక వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ స్పీకర్‌తో పాటు తాడ్వాయి టీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్‌ రెడ్డిని హత్య చేసేందుకు మావోయిస్టులు వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది.

తెలంగాణ నిఘా వర్గాలు అప్రమత్తంగా లేకపోయి ఉంటే ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో కీలక నేతలు మావోయిస్టుల చేతిలో దాడికి గురయ్యేవారు.

First Published:  15 Nov 2018 12:30 AM GMT
Next Story