Telugu Global
NEWS

పదవ ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీలకు వేదికగా న్యూఢిల్లీ

పదవ ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీలకు న్యూఢిల్లీ వేదికగా తెరలేచింది. 12 ఏళ్ల విరామం తర్వాత భారత గడ్డపై జరుగుతున్న ఈ పోటీలలో… భారత బాక్సింగ్ ఎవర్ గ్రీన్ స్టార్ మేరీ కోమ్…. ఆరో ప్రపంచ టైటిల్ కు ఉరకలేస్తోంది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా పోటీలు నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలోని పొగమంచు వాతావరణం, కాలుష్య భూతం సైతం… వివిధ దేశాల నుంచి వచ్చిన బాక్సర్లను భయపెడుతోంది. ఢిల్లీ పౌరులు మాత్రమే కాదు… పోటీలలో పాల్గొనటానికి వచ్చిన విదేశీ బాక్సర్లు సైతం… మాస్క్ […]

పదవ ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీలకు వేదికగా న్యూఢిల్లీ
X

పదవ ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీలకు న్యూఢిల్లీ వేదికగా తెరలేచింది. 12 ఏళ్ల విరామం తర్వాత భారత గడ్డపై జరుగుతున్న ఈ పోటీలలో… భారత బాక్సింగ్ ఎవర్ గ్రీన్ స్టార్ మేరీ కోమ్…. ఆరో ప్రపంచ టైటిల్ కు ఉరకలేస్తోంది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా పోటీలు నిర్వహిస్తున్నారు.

న్యూఢిల్లీలోని పొగమంచు వాతావరణం, కాలుష్య భూతం సైతం… వివిధ దేశాల నుంచి వచ్చిన బాక్సర్లను భయపెడుతోంది. ఢిల్లీ పౌరులు మాత్రమే కాదు… పోటీలలో పాల్గొనటానికి వచ్చిన విదేశీ బాక్సర్లు సైతం… మాస్క్ లు ధరించి ప్రాక్టీసులో పాల్గొంటున్నారు.

మొత్తం ఐదు విభాగాలలో …ప్రత్యేకంగా పోటీలు నిర్వహించడానికి రంగం సిద్ధమయ్యింది. మహిళల 51 కిలోలు, 57, 60, 69, 75 కిలోల విభాగాలలో వివిధ దేశాలకు చెందిన మహిళా బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు.

ఢిల్లీ వేదికగా 2006లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ పోటీల మహిళల 48 కిలోల విభాగంలో మేరీ కోమ్, 60 కిలోల విభాగంలో సరితా దేవి మాత్రమే పాల్గొన్నారు.

ప్రస్తుత టోర్నీ లో మేరీ కోమ్…. ముగ్గురు బిడ్డల తల్లిగా, 35 ఏళ్ల వయసులో మరో ప్రపంచ టైటిల్ కోసం బరిలోకి దిగుతోంది.

2020 టోక్యో ఒలింపిక్స్ లో సైతం మహిళా బాక్సింగ్ ఓ మెడల్ ఈవెంట్ గా ఉండడంతో…మొత్తం 10 మంది సభ్యుల జట్టుతో భారత్ బాక్సర్లు పోటీకి దిగుతున్నారు.

2001 నుంచి జరిగిన ప్రపంచ మహిళా బాక్సింగ్ లో…అత్యధిక పతకాలు సాధించిన మొదటి ఐదుజట్లలో రష్యా, చైనా, భారత్, కొరియా, కెనడా ఉన్నాయి.

భారత బాక్సర్లు మొత్తం 8 స్వర్ణ, 6 రజత, 14 కాంస్యాలతో సహా 28 పతకాలు సాధించడం ద్వారా తమ జట్టును మూడో స్థానంలో నిలిపారు.

72 దేశాలకు చెందిన మొత్తం 300 మంది బాక్సర్లు ప్రస్తుత 2018 ప్రపంచకప్ బాక్సింగ్ బరిలోకి దిగుతున్నారు.

First Published:  15 Nov 2018 6:24 AM GMT
Next Story