Telugu Global
Family

తుంబురుడు

తుంబురనాధామృతం అనేపదం అప్పుడప్పుడైనా మీరు వినే ఉంటారు. వీణానాధాన్నిఅమృతంలా అందిస్తే, ఆస్వాధించే వాళ్ళు’ తుంబురనాధం’గా అభినందిస్తారు. వీణానాధానికి తుంబురము పర్యాయపదమై పోయింది గదా, మరి అలాంటి తుంబురుని గురించి తెలుసుకుందామా?! తుంబురుడు గంధర్వ వంశమున పుట్టినవాడు. కుబేరుని కొలువులో నెలవున్నవాడు. అయితే రంబయందు ఉన్న వలపు చేత ఏ కొలువున ఉన్నాడో- ఆరాజు కుబేరుణ్నే కొలవడం మరిచిపోయాడు. తన వీణా నాధాన్ని అందివ్వలేకపోయాడు. అప్పుడు విషయాన్ని గ్రహించిన కుబేరుడు ‘రాక్షసుడివై పుట్టు’ అని తుంబురుడిని శపించాడు. తుంబురుడు రాక్షసునిగా విరాధునికి పుట్టాడు. తుంబురుని […]

తుంబురనాధామృతం అనేపదం అప్పుడప్పుడైనా మీరు వినే ఉంటారు. వీణానాధాన్నిఅమృతంలా అందిస్తే, ఆస్వాధించే వాళ్ళు’ తుంబురనాధం’గా అభినందిస్తారు. వీణానాధానికి తుంబురము పర్యాయపదమై పోయింది గదా, మరి అలాంటి తుంబురుని గురించి తెలుసుకుందామా?!

తుంబురుడు గంధర్వ వంశమున పుట్టినవాడు. కుబేరుని కొలువులో నెలవున్నవాడు. అయితే రంబయందు ఉన్న వలపు చేత ఏ కొలువున ఉన్నాడో- ఆరాజు కుబేరుణ్నే కొలవడం మరిచిపోయాడు. తన వీణా నాధాన్ని అందివ్వలేకపోయాడు. అప్పుడు విషయాన్ని గ్రహించిన కుబేరుడు ‘రాక్షసుడివై పుట్టు’ అని తుంబురుడిని శపించాడు.

తుంబురుడు రాక్షసునిగా విరాధునికి పుట్టాడు. తుంబురుని వీణపేరు కళావతిగా చెపుతారు.

ఈ కథంతా రామాయణంలో వుంది. అయితే హర విలాసములో తుంబురుని కథ మరో విధంగా వుంది. ఆ కథలో –

తుంబురుడు సతీసమేతంగా ఈశ్వరుణ్ని సేవించడానికి బయల్దేరి వెళతాడు. దారి మధ్యలో దూర్వాస మహాముని లేడి పిల్లలకు ఆహారాన్ని పెడుతూవుంటాడు. తుంబురుడు ముని చేసే పోషణానికి ఆశ్చర్య పోయి చూస్తాడు. ఆ సంతోష సమయంలో ఆనందం పట్టలేక తుంబురుడు చిటిక వేస్తాడు. ఆ చప్పుడికి లేడిపిల్లలు బెదిరిపోయాయట. ఆకలితో పారిపోయిన లేడి పిల్లలను చూసి, అందుకు కారణమయిన తుంబురునితో ‘నువ్వు గంధర్వుడనని గర్వంతోవున్నావు, కనుక అది తీరేలా నువ్వు మనుష్య జన్మ నెత్తుదువు గాక!’ అని శపిస్తాడు. దుర్వాస మహామునికి కోపం ఎక్కువ కదా మరి.

ఈ శాప ఫలితంగానే తుంబురుడు చిరుతొండడుగా వైశ్యకుటుంబాన కాంచీనగరంలో పుట్టాడట. తుంబురుని శాప వృత్తాంతం ఎలా వున్నా- ఆయన మీటే వీణామృతము పురాణ కాలమునుండి ఈ కాలానికీ నిలచిపోయింది!

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  16 Nov 2018 8:30 AM GMT
Next Story