Telugu Global
Cinema & Entertainment

ఐటెం సాంగ్ కి కూడా భారీ సెట్

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మొదటి సారి వస్తున్న సినిమా “వినయ విధేయ రామ”. ఇటివలే రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క మాస్ టిజర్ ఈ సినిమా పై అందరిలోనూ అంచనాలు పెంచేసింది. బోయపాటి శ్రీను సినిమా అంటే ఐటెం సాంగ్ పక్కాగా ఉండాలి, అయితే ఈ సినిమాలో కూడా ఒక హాట్ ఐటెం సాంగ్ ని ప్లాన్ చేసాడు బోయపాటి. హైదరబాద్ లో వేసిన […]

ఐటెం సాంగ్ కి కూడా భారీ సెట్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మొదటి సారి వస్తున్న సినిమా “వినయ విధేయ రామ”. ఇటివలే రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క మాస్ టిజర్ ఈ సినిమా పై అందరిలోనూ అంచనాలు పెంచేసింది. బోయపాటి శ్రీను సినిమా అంటే ఐటెం సాంగ్ పక్కాగా ఉండాలి, అయితే ఈ సినిమాలో కూడా ఒక హాట్ ఐటెం సాంగ్ ని ప్లాన్ చేసాడు బోయపాటి.

హైదరబాద్ లో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో ఈ ఐటెం సాంగ్ షూట్ జరుగుతుంది. “మామ మియా” అంటూ సాగే ఈ సాంగ్ లో చరణ్ తన డాన్స్ మూవ్స్ తో అభిమానులని ఆకట్టుకుంటాడు అని మూవీ యూనిట్ అంటున్నారు. పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కి అన్నలుగా ప్రశాంత్ ఇంకా ఆర్యన్ రాజేష్ నటిస్తున్నారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు.

First Published:  16 Nov 2018 6:20 AM GMT
Next Story