Telugu Global
Cinema & Entertainment

"సై రా" సెట్ లో సీరియస్ అయిన చిరంజీవి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ బాధ్యతలు మొత్తం నెత్తి మీద వేసుకొని చేస్తున్న సినిమా “సై రా నరసింహ రెడ్డి”. అయితే కొంత కాలంగా  రామ్ చరణ్ “వినయ విధేయ రామ” సినిమాతో బిజీగా ఉండటంతో నిర్మాణ బాధ్యతలు కూడా చిరునే చూసుకుంటున్నాడట. అందుకే సెట్ లో చిరు చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని, తన కల్ల ముందు ఎవరైనా డబ్బు వేస్ట్ చేస్తే అస్సలు ఊరుకునే వాడు కాదట చిరంజీవి. ఒక సమయంలో […]

సై రా సెట్ లో సీరియస్ అయిన చిరంజీవి
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ బాధ్యతలు మొత్తం నెత్తి మీద వేసుకొని చేస్తున్న సినిమా “సై రా నరసింహ రెడ్డి”. అయితే కొంత కాలంగా రామ్ చరణ్ “వినయ విధేయ రామ” సినిమాతో బిజీగా ఉండటంతో నిర్మాణ బాధ్యతలు కూడా చిరునే చూసుకుంటున్నాడట. అందుకే సెట్ లో చిరు చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని, తన కల్ల ముందు ఎవరైనా డబ్బు వేస్ట్ చేస్తే అస్సలు ఊరుకునే వాడు కాదట చిరంజీవి.

ఒక సమయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి పై చిరు సీరియస్ అయ్యాడని, అనవసరమైన చోట కూడా ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నారు అన్నసంగతి తెలిసి సురేందర్ రెడ్డి కి క్లాస్ తీసుకున్నాడని టాక్. చ‌ర‌ణ్ సెట్లో ఉంటే మాత్రం చిరంజీవి మ‌రే విష‌యాల్నీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని. చ‌ర‌ణ్ కూడా కూల్‌గా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్తున్నాడ‌ని… కానీ చిరంజీవి మాత్రం సినిమా బడ్జెట్ పెరిగిపోతుండటంతో కొంచెం బెంగ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తీ కాలేదు, కానీ వచ్చే ఏడాది సమ్మర్ కి మాత్రం సినిమాని రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు మూవీ యూనిట్.

First Published:  15 Nov 2018 11:49 PM GMT
Next Story