Telugu Global
National

కాంగ్రెస్ రెబల్స్ అంతా ఇప్పుడు ఈ పార్టీ నుంచే పోటీ చేస్తారట....

హస్తం హ్యాండిచ్చింది.. అసమ్మతి వాదులంతా ఆశావాదులుగా మారిపోయారు. వీరవిధేయులంతా హస్తం జెండా గద్దెలను కూల్చేస్తున్నారు. హస్తం లేదని బాధపడుతున్న కాంగ్రెస్ రెబల్స్ కు ఇప్పుడు హాథీ (ఏనుగు) ఉందని అభయమిస్తోందట బీఎస్పీ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ సీటు దక్కక భంగపడ్డ నేతలందరికీ బీఎస్పీ టికెట్ ఇచ్చి ఏనుగు గుర్తుపై రంగంలోకి దింపడానికి రెడీ అయ్యిందట. దీంతో తెలంగాణ ఎన్నికల్లో బీఎస్పీ గుర్తుపై పోటీచేసే అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో […]

కాంగ్రెస్ రెబల్స్ అంతా ఇప్పుడు ఈ పార్టీ నుంచే పోటీ చేస్తారట....
X

హస్తం హ్యాండిచ్చింది.. అసమ్మతి వాదులంతా ఆశావాదులుగా మారిపోయారు. వీరవిధేయులంతా హస్తం జెండా గద్దెలను కూల్చేస్తున్నారు. హస్తం లేదని బాధపడుతున్న కాంగ్రెస్ రెబల్స్ కు ఇప్పుడు హాథీ (ఏనుగు) ఉందని అభయమిస్తోందట బీఎస్పీ పార్టీ.

తెలంగాణలో కాంగ్రెస్ సీటు దక్కక భంగపడ్డ నేతలందరికీ బీఎస్పీ టికెట్ ఇచ్చి ఏనుగు గుర్తుపై రంగంలోకి దింపడానికి రెడీ అయ్యిందట. దీంతో తెలంగాణ ఎన్నికల్లో బీఎస్పీ గుర్తుపై పోటీచేసే అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్నికల సమరం కంటే టికెట్లు రాని వారు రాజేస్తున్న సమరమే ఎక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్ టికెట్ వస్తుందని అన్నీ సమకూర్చుకున్న నేతలు కూటమి పొత్తుల్లో తమ స్థానం గల్లంతుకావడంతో అధిష్టానంపై భగ్గుమంటున్నారు. దాదాపు 25మంది కాంగ్రెస్ రెబెల్స్ తెలంగాణ ఎన్నికల బరిలో దిగడానికి సై అంటున్నారట. ఈ నేపథ్యంలోనే వీరందరినీ అక్కున చేర్చుకొని బీఎస్పీ తరఫున టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించుకున్నట్టు తాజా సమాచారం.

కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలైన 25మంది ఇప్పుడు కాంగ్రెస్ రెబల్స్ గా బరిలోకి దిగుతున్నారు. సూర్యపేటలో పటేల్ రమేష్ రెడ్డి.. వరంగల్ తూర్పులో నాయిని రాజేందర్ రెడ్డి, మేడ్చల్ లో జంగ యాదవ్, కంటోన్మెంట్ లో క్రిశాంక్, మంచిర్యాలలో అరవింద రెడ్డి, హుస్నాబాద్ లో ప్రవీణ్ రెడ్డి, ఈ మధ్యే కాంగ్రెస్ లో చేరిన బండ్ల గణేష్…. ఇలా చాలా మంది నేతలే ఉన్నారు. అటు సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి కూడా రాజేంద్రనగర్ టికెట్ తనకు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఇలా తిరుగుబావుటా ఎగురవేసిన కాంగ్రెస్ నేతల్ని ఎగరేసుకు పోవడానికి బీఎస్పీ పార్టీ రెడీ అవుతోందట.

ఇప్పుడు కాంగ్రెస్ రెబల్స్ కు బీఎస్పీ ఆపన్న హస్తం అందిస్తోందట. ఇప్పటికే చాలా మంది రెబల్స్ బీఎస్పీతో టచ్ లో ఉన్నారట. బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు వీర్ సింగ్ బీఎస్పీ బీఫాంలతో తాజాగా హైదరాబాద్ లో మకాం వేశాడట. కాంగ్రెస్ అసమ్మతి నేతలతో మంతనాలు జరుపుతున్నారట.

బీఎస్పీ తెలంగాణ రాజకీయాలకు కొత్తేమీ కాదు.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కని నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప బీఎస్పీ తరఫున గెలిచారు. ఇందులో అల్లోల టీఆర్ఎస్ లో చేరి మంత్రి కూడా అయ్యారు. 2004లో డీకే అరుణ కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ తరఫున గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో టికెట్ దక్కని నేతల చూపు ఇప్పుడు బీఎస్పీ పై పడింది.

First Published:  16 Nov 2018 1:05 AM GMT
Next Story