Telugu Global
NEWS

చంద్రబాబు చర్య అవినీతిపరులకు వెసులుబాటే " మాజీ జేడీ లక్ష్మీనారాయణ

సీబీఐ ఏపీలో అడుగు పెట్టకూడదంటూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తప్పుపట్టారు. సాధారణ సమ్మతి ఉపసంహరణ అవినీతిని ప్రోత్సహించడమేనన్నారు. అవినీతిపరులకు ఈ పరిణామం మంచి చేసేలా ఉందన్నారు. ఆస్పత్రిలో ఒక డాక్టర్ ప్రవర్తన సరిగా లేకుంటే ఏకంగా ఆస్పత్రినే మూసేస్తామా అని ప్రశ్నించారు. ఆ ఒక్క డాక్టర్ పై చర్యలు తీసుకుంటే సరిపోతుందన్నారు. అలాగే సీబీఐలో కొందరు అధికారుల తీరు బాగోలేదని ఇలా చేయడం సరికాదన్నారు. ఇలాంటి జీవో జారీ […]

చంద్రబాబు చర్య అవినీతిపరులకు వెసులుబాటే  మాజీ జేడీ లక్ష్మీనారాయణ
X

సీబీఐ ఏపీలో అడుగు పెట్టకూడదంటూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తప్పుపట్టారు. సాధారణ సమ్మతి ఉపసంహరణ అవినీతిని ప్రోత్సహించడమేనన్నారు. అవినీతిపరులకు ఈ పరిణామం మంచి చేసేలా ఉందన్నారు.

ఆస్పత్రిలో ఒక డాక్టర్ ప్రవర్తన సరిగా లేకుంటే ఏకంగా ఆస్పత్రినే మూసేస్తామా అని ప్రశ్నించారు. ఆ ఒక్క డాక్టర్ పై చర్యలు తీసుకుంటే సరిపోతుందన్నారు. అలాగే సీబీఐలో కొందరు అధికారుల తీరు బాగోలేదని ఇలా చేయడం సరికాదన్నారు.

ఇలాంటి జీవో జారీ చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. అవినీతిపై పోరాటాన్ని రాష్ట్రంపై పోరాటం, కేంద్రంపై పోరాటం అనడం సరికాదన్నారు. దేశం ముందుకు వెళ్లకపోవడానికి అవినీతే కారణమని…. ఇలాంటి సమయంలో సీబీఐ రాకూడదని జీవోలు ఇవ్వడం అవినీతిపరులకు మరింత వెసులుబాటు కల్పించినట్టు అవుతుందన్నారు.

రాజకీయ పోరాటం చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ… ఇలా వ్యవస్థను దెబ్బతీయడం మాత్రం సరికాదన్నారు. జగన్ పై హత్యాయత్నం కేసును హైకోర్టు నేరుగా సీబీఐకి అప్పగిస్తే… అప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అడ్డుకోలేదన్నారు.

సీబీఐ కేంద్రం చేతిలో ఉందని అభ్యంతరం తెలిపినప్పుడు… ఏసీబీ కూడా రాష్ట్ర పరిధిలో ఉందన్న విమర్శ కూడా వస్తుందన్నారు.

First Published:  16 Nov 2018 9:58 AM GMT
Next Story