Telugu Global
NEWS

జగన్‌ కేసులో హైకోర్టును శాసించే ప్రయత్నం " న్యాయవాది

ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ ప్రవేశంపై చంద్రబాబు ప్రభుత్వం నిషేధం విధించడంపై న్యాయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఏపీలో ఐటీ దాడులు చేస్తే…. ఐటీ అధికారులపై ఏసీబీని ప్రయోగించేందుకు వీలుగా జీవో తీసుకురావడం కూడా చర్చనీయాంశమైంది. చంద్రబాబు హఠాత్తుగా సీబీఐపై ఏపీలో నిషేధం విధించడం వెనుక జగన్‌పై హత్యాయత్నం కేసు కూడా కీలక కారణంగా భావిస్తున్నారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో సిట్‌ విచారణలో ఏమాత్రం పస లేకపోవడం, ఇప్పటికే వైసీపీ నేతలు థర్డ్ పార్టీ విచారణ కోసం హైకోర్టును […]

జగన్‌ కేసులో హైకోర్టును శాసించే ప్రయత్నం  న్యాయవాది
X

ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ ప్రవేశంపై చంద్రబాబు ప్రభుత్వం నిషేధం విధించడంపై న్యాయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఏపీలో ఐటీ దాడులు చేస్తే…. ఐటీ అధికారులపై ఏసీబీని ప్రయోగించేందుకు వీలుగా జీవో తీసుకురావడం కూడా చర్చనీయాంశమైంది.

చంద్రబాబు హఠాత్తుగా సీబీఐపై ఏపీలో నిషేధం విధించడం వెనుక జగన్‌పై హత్యాయత్నం కేసు కూడా కీలక కారణంగా భావిస్తున్నారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో సిట్‌ విచారణలో ఏమాత్రం పస లేకపోవడం, ఇప్పటికే వైసీపీ నేతలు థర్డ్ పార్టీ విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో…. కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశాలు కూడా లేకపోలేదు.

అదే జరిగితే జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలక సూత్రధారులు ఈజీగా దొరికిపోతారు. అందుకే జగన్‌పై హత్యాయత్నం కేసును సీబీఐకి అప్పగించకుండా హైకోర్టును శాసించే ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ పని చేసిందని హైకోర్టు న్యాయవాది అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.

తాము ఏపీలో సీబీఐని నిషేధించాం కాబట్టి జగన్‌పై హత్యాయత్నం కేసును సీబీఐకి అప్పగించడానికి వీల్లేదని కోర్టు ముందు వాదించేందుకు వీలుగా ఈ పనిచేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తీరు చూస్తుంటే హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి హైదరాబాద్‌లో కూడా సీబీఐ తిరగడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.

జగన్‌పై దాడి కేసులో దాడి చేసిన శ్రీనివాస్‌, ముందే చెప్పిన నటుడు శివాజీతో పాటు వారి వెనుక ఉన్న బిగ్ బాస్‌ను కూడా బయటకు రప్పించాల్సిన అవసరం ఉందన్నారు.

First Published:  15 Nov 2018 11:37 PM GMT
Next Story