Telugu Global
NEWS

గెలవాలంటే.... సోనియా గాంధీ, కేసీఆర్ రావాల్సిందేనట

తెలంగాణలో పోలింగ్ టైం దగ్గరపడుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. గులాబీ దళం ఎప్పుడో అభ్యర్థులను ప్రకటించేయగా, కాంగ్రెస్ ఇటీవల టిక్కెట్లను ఖరారు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి టీఆర్ఎస్ పోరాటమే కారణమని తెలంగాణ సెంటిమెంటే ప్రధాన అస్త్రంగా కేసీఆర్ గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అటు కాంగ్రెస్ కూడా సోనియా దయ వల్లే తెలంగాణ ఏర్పడిందని ప్రచారం చేశారు. కాగా, ప్రస్తుత ఎన్నికల ప్రచార వేళ కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండింటికి తెలంగాణ […]

గెలవాలంటే.... సోనియా గాంధీ, కేసీఆర్ రావాల్సిందేనట
X

తెలంగాణలో పోలింగ్ టైం దగ్గరపడుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. గులాబీ దళం ఎప్పుడో అభ్యర్థులను ప్రకటించేయగా, కాంగ్రెస్ ఇటీవల టిక్కెట్లను ఖరారు చేసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి టీఆర్ఎస్ పోరాటమే కారణమని తెలంగాణ సెంటిమెంటే ప్రధాన అస్త్రంగా కేసీఆర్ గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అటు కాంగ్రెస్ కూడా సోనియా దయ వల్లే తెలంగాణ ఏర్పడిందని ప్రచారం చేశారు.

కాగా, ప్రస్తుత ఎన్నికల ప్రచార వేళ కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండింటికి తెలంగాణ సెంటిమెంటే ప్రధాన అస్ర్తంగా మారింది. అభ్యర్థులు నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తున్నా…. గులాబీ శ్రేణులను ఉత్సాహ పరిచే శక్తి సరిపోవడం లేదట… అదే కేసీఆర్ వచ్చి నియోజకవర్గంలో ఒక్క మీటింగ్ పెట్టి ప్రసంగం చేస్తే విజయం లాంఛనమేనని చాలా మంది భావిస్తున్నారట. ఆయన రావాలని కోరుతూ విన్నపాలు పంపుతున్నారట.

ఇక, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా సోనియా గాంధీ అనే అస్త్రాన్ని రంగంలోకి దింపేందుకు సమాయత్తమవుతున్నారు. విభజన తరువాత కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చారన్నది కాంగ్రెస్ నేతల వాదన. కానీ, తెలంగాణ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్సే అన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని అంటున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ బాగా యాక్టివ్ అయ్యారు. కానీ, ఆయన కంటే సోనియా గాంధీపైనే కొంత సానుకూల దృక్పథం తెలంగాణ ప్రజల్లో ఉందని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. ఈ క్రమంలో సోనియాను ఎన్నికల ప్రచారంలోకి దింపితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట. ఈ నెల 25 లేదా 27 తేదీల్లో బహిరంగ సభ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు.

మొత్తం మీద ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేతలు కేసీఆర్, సోనియా గాంధీలు వస్తేనే గెలుపు నల్లేరు మీద నడకలా సాగిపోతుందని భావిస్తున్నారు ఇరు పార్టీల అభ్యర్థులు. పోలింగ్ కు కొద్ది రోజులే ఉండటంతో ఎత్తుకు పై ఎత్తులు కూడా ఎక్కువయ్యాయి.

మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ నే నమ్ముకున్న టీఆర్ఎస్ , కాంగ్రెస్ లకు ఈ అస్త్రాలు ఎంత వరకు పనిచేస్తాయో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

First Published:  16 Nov 2018 3:10 AM GMT
Next Story