Telugu Global
Cinema & Entertainment

భారీ సెట్ లో ఇంటర్వెల్ ప్లాన్ చేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాగా రూపొందుతున్న సినిమా “మహర్షి”. పూర్తి స్థాయి క్లాస్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటివలే అమెరికా షూటింగ్ ని పూర్తీ చేసుకొని హైదరాబాద్ వచ్చారు మూవీ యూనిట్. తదుపరి షెడ్యూల్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక భారీ సెట్ ని వేశారట టీం. ఈ సెట్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసాడు వంశీ పైడిపల్లి. ఎంతో ఎమోషనల్ […]

భారీ సెట్ లో ఇంటర్వెల్ ప్లాన్ చేసిన మహేష్ బాబు
X

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాగా రూపొందుతున్న సినిమా “మహర్షి”. పూర్తి స్థాయి క్లాస్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటివలే అమెరికా షూటింగ్ ని పూర్తీ చేసుకొని హైదరాబాద్ వచ్చారు మూవీ యూనిట్.

తదుపరి షెడ్యూల్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక భారీ సెట్ ని వేశారట టీం. ఈ సెట్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసాడు వంశీ పైడిపల్లి. ఎంతో ఎమోషనల్ గా సాగే ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్ గా నిలువనుంది అని టాక్. ఈ సినిమాలో మహేష్ బాబు స్టూడెంట్ గా అలాగే అమెరికాలో ఒక కంపెనీ సిఈఓ గా కూడా నటిస్తున్నాడు.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని వెంకటేశ్వరా క్రియేషన్స్ పై దిల్ రాజు, వైజయంతి మూవీస్ పై అశ్వినీ దత్ ఈ సినిమాని కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.

First Published:  16 Nov 2018 2:42 AM GMT
Next Story