Telugu Global
NEWS

నందమూరి సుహాసిని ని చిత్తు చిత్తుగా ఓడిస్తాం.... ఇదే మా శపథం

తెలంగాణలో ఏర్పడిన మహాకూటమి మంటల్లో చిక్కుకుంది. పొత్తులో సీట్లు కోల్పోయిన పార్టీల నేతలు శపథాలు చేస్తున్నారు. ఈ జాబితాలోకి కూకట్‌పల్లి నియోజకవర్గం కూడా వచ్చి చేరింది. నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ తరపున హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. తొలుత సీనియర్ నేత పెద్దిరెడ్డికి టికెట్‌ కేటాయించి.. ప్రచారం మొదలుపెట్టిన తర్వాత అతడిని వెనక్కు పిలిపించారు. దీంతో పెద్దిరెడ్డి వర్గం దిగ్బ్రాంతికి గురయ్యారు. పెద్దిరెడ్డిని అవమానకరంగా పోటీ నుంచి తప్పించడంపై ఒక సామాజికవర్గం […]

నందమూరి సుహాసిని ని చిత్తు చిత్తుగా ఓడిస్తాం.... ఇదే మా శపథం
X

తెలంగాణలో ఏర్పడిన మహాకూటమి మంటల్లో చిక్కుకుంది. పొత్తులో సీట్లు కోల్పోయిన పార్టీల నేతలు శపథాలు చేస్తున్నారు. ఈ జాబితాలోకి కూకట్‌పల్లి నియోజకవర్గం కూడా వచ్చి చేరింది. నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ తరపున హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.

తొలుత సీనియర్ నేత పెద్దిరెడ్డికి టికెట్‌ కేటాయించి.. ప్రచారం మొదలుపెట్టిన తర్వాత అతడిని వెనక్కు పిలిపించారు. దీంతో పెద్దిరెడ్డి వర్గం దిగ్బ్రాంతికి గురయ్యారు. పెద్దిరెడ్డిని అవమానకరంగా పోటీ నుంచి తప్పించడంపై ఒక సామాజికవర్గం వారు రగిలిపోతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించి దెబ్బతిన్న కాంగ్రెస్‌ నేతలు శపథం చేస్తున్నారు. కూకట్‌ పల్లిలో నందమూరి సుహాసినిని ఓడించి తీరుతామని… అది కూడా చిత్తుచిత్తుగా ఓడిస్తామని నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.

టికెట్‌ను స్థానికులకు కాకుండా నందమూరి ఫ్యామిలీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ…. కాంగ్రెస్‌ నాయకులు కేపీహెచ్‌బీ రోడ్‌ నంబర్‌ 1లోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్‌ కేటాయించడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమ తరపున సమర్ధుడైన నాయకుడిని రెబల్‌గా బరిలో నిలుపుతామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. సుహాసినిని చిత్తు చిత్తుగా ఓడించడమే తన లక్ష్యమన్నారు. చంద్రబాబు కుల రాజకీయాలు తెలంగాణలో చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

అటు తనకు జరిగిన అవమానంపై టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన వర్గం కూడా సుహాసినికి సహకరించే పరిస్థితులు కనిపించడం లేదు. ఆయన్ను బుజ్జగించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

First Published:  16 Nov 2018 5:46 AM GMT
Next Story