Telugu Global
NEWS

కంగారూ సవాలుకు టీమిండియా సిద్ధం

64 రోజుల ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ఆస్ట్రేలియాతో టీమిండియా నాలుగు టెస్టులు, 3 టీ-20, వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆస్ట్రేలియాలో 64 రోజుల పర్యటన కోసం…విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా…ముంబై నుంచి కంగారూ ల్యాండ్ కు బయలు దేరి వెళ్లింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లపై తమకు ఎదురయ్యే సవాళ్లకు సిద్ధంగా ఉన్నామని…టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి ప్రకటించారు. తొమ్మిదివారాల తన పర్యటన కాలంలో టెస్ట్ క్రికెట్ టాప్ […]

కంగారూ సవాలుకు టీమిండియా సిద్ధం
X
  • 64 రోజుల ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా
  • ఆస్ట్రేలియాతో టీమిండియా నాలుగు టెస్టులు, 3 టీ-20, వన్డే మ్యాచ్ ల సిరీస్

ఆస్ట్రేలియాలో 64 రోజుల పర్యటన కోసం…విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా…ముంబై నుంచి కంగారూ ల్యాండ్ కు బయలు దేరి వెళ్లింది.

ఆస్ట్రేలియా ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లపై తమకు ఎదురయ్యే సవాళ్లకు సిద్ధంగా ఉన్నామని…టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి ప్రకటించారు.

తొమ్మిదివారాల తన పర్యటన కాలంలో టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా…నాలుగు టెస్టులు, మూడేసి టీ-20, వన్డే సిరీస్ ల్లో… కంగారూ జట్టుతో తలపడనుంది.

తన సామార్థ్యంతో పాటు…జట్టు సభ్యుల సత్తాపైన తనకు నమ్మకం ఉందని ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ ధీమాగా చెబుతున్నాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ ప్లేయర్లు లేని ఆస్ట్రేలియా పైన టీమిండియా విజయం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

21 నుంచి తీన్మార్ టీ-20 సిరీస్

ఆస్ట్రేలియాతో టీమిండియా తీన్మార్ టీ-20 సిరీస్…బ్రిస్బేన్ వేదికగా ఈనెల 21న ప్రారంభమవుతుంది. 23న మెల్బోర్న్ వేదికగా రెండు, 25న సిడ్నీ వేదికగా మూడో టీ-20లతో సిరీస్ కు తెరపడుతుంది.

డిసెంబర్ 6 నుంచి టెస్ట్ సిరీస్…

నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ డిసెంబర్ 6న అడిలైడ్ ఓవల్ వేదికగా ప్రారంభమవుతుంది. సిరీస్ లోని రెండో టెస్ట్ మ్యాచ్ ను పెర్త్ వాకా స్టేడియం వేదికగా నిర్వహిస్తారు.

మూడో టెస్ట్ మ్యాచ్ ను ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

జనవరి మూడు నుంచి సిడ్నీ క్రికెట్ స్టేడియంలో నాలుగో టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తారు.

జనవరి 12 నుంచి వన్డే సిరీస్…

వన్డే సిరీస్ లోని తొలి మ్యాచ్ కు సిడ్నీ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. జనవరి 12న ఈమ్యాచ్ నిర్వహిస్తారు. జనవరి 15న అడిలైడ్ ఓవల్ లో రెండో వన్డే, జనవరి 18న మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆఖరి వన్డే జరుగుతుంది. ఈమ్యాచ్ తో… ఆస్ట్రేలియాలో 64 రోజుల టీమిండియా పర్యటన ముగియనుంది.

First Published:  15 Nov 2018 10:47 PM GMT
Next Story