Telugu Global
Cinema & Entertainment

త్రిష సినిమా పై కన్నేసిన అల్లు అర్జున్

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కడ చూసినా తమిళ సినిమా “96” గురించే మాట్లాడుకుంటున్నారు. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా తమిళ్ లో మంచి హిట్ గా నిలిచి ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. అయితే ఈ సినిమాని తెలుగు లో రీమేక్ చేద్దాం అని తెలుగు నిర్మాతలు అందరూ లైన్ లో ఉన్నారు. దిల్ రాజు అయితే ఈ సినిమాని ఎలాగైనా రీమేక్ చేయాలి అని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అయితే […]

త్రిష సినిమా పై కన్నేసిన అల్లు అర్జున్
X

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కడ చూసినా తమిళ సినిమా “96” గురించే మాట్లాడుకుంటున్నారు. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా తమిళ్ లో మంచి హిట్ గా నిలిచి ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది.

అయితే ఈ సినిమాని తెలుగు లో రీమేక్ చేద్దాం అని తెలుగు నిర్మాతలు అందరూ లైన్ లో ఉన్నారు. దిల్ రాజు అయితే ఈ సినిమాని ఎలాగైనా రీమేక్ చేయాలి అని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా పై అల్లు అర్జున్ కన్ను పడిందట.

రీసెంట్ గా ఈ సినిమాని చూసిన అల్లు అర్జున్ ఈ సినిమా మత్తులో పడిపోయాడట. ఈ సినిమాని ఎలాగైనా సరే తెలుగులో రిమేక్ చేయాలని అల్లు అర్జున్ గట్టిగా ఫిక్స్ అయినట్టు టాక్. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు అనే రూమర్స్ ఇండస్ట్రీ లో ఉన్నాయి.

అందుకే ఇప్పుడు ఈ రీమేక్ ని కూడా అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి త్రివిక్రమ్ తెరకెక్కించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి అల్లు అర్జున్ “96” సినిమాకి తగిన న్యాయం చేస్తాడో లేదో చూడాలి.

First Published:  16 Nov 2018 2:35 AM GMT
Next Story