దీపిక కోసం 50 కోట్ల బంగ్లా

దీపిక పదుకోన్, రణ్వీర్ సింగ్ పెళ్లయిపోయింది. ఒకసారి కాదు, ఏకంగా 2సార్లు పెళ్లి చేసుకుంది ఈ జంట. ఓసారి సింధి సంప్రదాయంలో, మరోసారి కొంకణి స్టయిల్ లో వీళ్ల వివాహం జరిగింది. ఇటలీలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఇంకా ఇండియా రాలేదు. వచ్చిన తర్వాత ఎక్కడుంటారనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి.

ఈ విషయంలో రణ్వీర్-దీపిక పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. పెళ్లికి ముందే ఓ ఖరీదైన బంగ్లాను బుక్ చేసుకొని మరీ ఇటలీకి వెళ్లింది ఈ జంట. ముంబయిలోని జుహు ప్రాంతంలో 50 కోట్ల రూపాయల ఖరీదైన బంగ్లాను వీళ్లిద్దరూ కలిసి కొనుగోలు చేశారు. ఆ ఇంట్లోనే వీళ్లు కాపురం పెట్టబోతున్నారు. అయితే అది ఇప్పుడే కాదు.

ఇండియా వచ్చిన వెంటనే బెంగళూరులో రిసెప్షన్ ఏర్పాటుచేస్తారు. ఆ తర్వాత ముంబయిలో మరో గ్రాండ్ రిసెప్షన్ పెడతారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నారు. ఈ తతంగం అంతా పూర్తవ్వడానికి కనీసం 2 నెలలు పడుతుంది. ఈ గ్యాప్ లో మరో 5 కోట్లు ఖర్చుచేసి ఇంట్లో ఇంటీరియర్ సెట్ చేసుకోబోతున్నారు. ఆ తర్వాత కొత్త ఇంట్లో గృహప్రవేశం.

మరోవైపు తన పెళ్లి సందర్భంగా ఊహించని కానుక అందుకుంది దీపిక. ఈమెకు సంబంధించిన మైనపు విగ్రహం రెడీ అయింది. లండన్ కు చెందిన టుస్సాడ్స్ మ్యూజియం నిర్వహకులు, దీపికకు శుభాకాంక్షలు చెబుతూనే, ఆమె మైనపు ప్రతిమను వచ్చే నెలలే ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.