Telugu Global
International

అలా అయితే అమెజాన్ కూడా దివాళా తీస్తుంది.... కంపెనీ యజమాని వ్యాఖ్యలు

ఏ రంగంలోనైనా ఏ ఒక్క వ్యక్తిదో.. సంస్థదో గుత్తాధిపత్యం ఉన్నా అది జీవితాంతం ఉండదు. అత్యంత విజయవంతమైన వ్యక్తులు కూడా ఏదో ఒక రోజు విఫలం చెందవచ్చు. ఇప్పుడు ఈ ఉపోద్గాతం ఎందుకంటే… ఒకప్పుడు ఆన్‌లైన్ మార్కెట్లోనే గుత్తాధిపత్యం సాధించిన అమెజాన్.. ఇప్పుడు నష్టాల బాటలో నడుస్తోంది. అమెరికన్ ఈ-కామర్స్‌లో ఎంతో విజయవంతమైన ఈ సంస్థ.. తన అనుబంధ ఆఫ్‌లైన్ స్టోర్స్ అయిన సియర్స్ దివాళా తీయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సియర్స్ దివాళా తీయడంపై మార్కెట్ […]

అలా అయితే అమెజాన్ కూడా దివాళా తీస్తుంది.... కంపెనీ యజమాని వ్యాఖ్యలు
X

ఏ రంగంలోనైనా ఏ ఒక్క వ్యక్తిదో.. సంస్థదో గుత్తాధిపత్యం ఉన్నా అది జీవితాంతం ఉండదు. అత్యంత విజయవంతమైన వ్యక్తులు కూడా ఏదో ఒక రోజు విఫలం చెందవచ్చు.

ఇప్పుడు ఈ ఉపోద్గాతం ఎందుకంటే… ఒకప్పుడు ఆన్‌లైన్ మార్కెట్లోనే గుత్తాధిపత్యం సాధించిన అమెజాన్.. ఇప్పుడు నష్టాల బాటలో నడుస్తోంది. అమెరికన్ ఈ-కామర్స్‌లో ఎంతో విజయవంతమైన ఈ సంస్థ.. తన అనుబంధ ఆఫ్‌లైన్ స్టోర్స్ అయిన సియర్స్ దివాళా తీయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సియర్స్ దివాళా తీయడంపై మార్కెట్ విశ్లేషకులే కాకుండా అమెజాన్ కంపెనీ ఉద్యోగులు కూడా ఆశ్చర్యపడ్డారు. కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను ఉద్యోగులు ఈ విషయం అడిగేశారు. సీటెల్‌లో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాలయంలో బెజోస్ కంపెనీ ఉద్యోగులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అక్కడ తనకు ఎదురైన ప్రశ్నకు బెజోస్ సూటిగా సమాధానం ఇచ్చారు.

ఇంతకూ ఉద్యోగులు అడిగిన ఆ ప్రశ్న ఏంటంటే.. అమెజాన్ వంటి విజయవంతమైన సంస్థ నుంచి పుట్టిన సియర్స్.. ఎందుకు దివాళా తీసింది అని అడిగారు. దీనికి బెజోస్ సూటిగా సమాధానం ఇచ్చారు.

ఏ సంస్థ అయినా అత్యంత విజయవంతంగా ఎక్కువ కాలం కొనసాగలేదని.. అంతే కాకుండా 30 ఏళ్ల వరకు నడిచిన సంస్థలు ఉన్నాయి కాని వందేళ్లు నడిచిన సంస్థలు లేవని అన్నారు.

ఇప్పుడు అమెజాన్ ఉద్యోగులు చేయవలసింది ఏంటంటే.. ఈ సంస్థ మనుగడను వీలైనంత కాలం పొడిగించడమే అని అన్నారు. వినియోగదారులపై మన దృష్టి ఉండాలి కాని మన గురించే ఆలోచిస్తే సంస్థ పతనం జరగడం ఖాయం అన్నారు.

First Published:  16 Nov 2018 8:30 PM GMT
Next Story