Telugu Global
NEWS

రెండు నెలల్లో నోటిఫికేషనే వస్తుంది.... కుట్రలు చేయాల్సిన ఖర్మేంటి?

భారతదేశ రాజ్యాంగాన్ని ప్రశ్నించే స్థాయికి చంద్రబాబు రావడం దురదృష్టకరమన్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి.  చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆ సమయంలో వ్యవస్థలు పని చేయడం లేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ మరో వైపు సేవ్‌ డెమోక్రసి అంటూ దేశంలో తిరగడం విచిత్రంగా ఉందన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉందంటున్న చంద్రబాబు… 40 ఏళ్ల జగన్‌మోహన్ రెడ్డిపై కక్ష సాధింపుకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు.  సమాఖ్య స్పూర్తిని దెబ్బతీయాలన్న ఆలోచనతోనే […]

రెండు నెలల్లో నోటిఫికేషనే వస్తుంది.... కుట్రలు చేయాల్సిన ఖర్మేంటి?
X

భారతదేశ రాజ్యాంగాన్ని ప్రశ్నించే స్థాయికి చంద్రబాబు రావడం దురదృష్టకరమన్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆ సమయంలో వ్యవస్థలు పని చేయడం లేదన్నారు.

రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ మరో వైపు సేవ్‌ డెమోక్రసి అంటూ దేశంలో తిరగడం విచిత్రంగా ఉందన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉందంటున్న చంద్రబాబు… 40 ఏళ్ల జగన్‌మోహన్ రెడ్డిపై కక్ష సాధింపుకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు.

సమాఖ్య స్పూర్తిని దెబ్బతీయాలన్న ఆలోచనతోనే చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. సీబీఐ తన రాష్ట్రంలో అడుగు పెట్టకూడదని జీవో ఇవ్వడం ద్వారా భారత దేశాన్నే ధిక్కరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అసలు చంద్రబాబు దేశంలో భాగమో కాదో చెప్పాలన్నారు.

రాష్ట్రానికి గజ తుపాను ముప్పు తప్పినా చంద్రబాబు పాలన వల్ల గజగజ ప్రజలు వణకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అవినీతి పరులు, పన్ను ఎగవేతదారులపై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర హైకోర్టు చంద్రబాబుపై విచారణకు ఆదేశిస్తే అప్పుడు హైకోర్టును కూడా ఏపీలో నిషేధిస్తారా అని ప్రశ్నించారు.

న్యాయవ్యవస్థను కూడా శాసించే విధంగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబులాంటి ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎన్నడూ లేరన్నారు. చంద్రబాబులో ఏదో తెలియని భయం పట్టుకుందన్నారు.

జగన్‌ మోహన్‌ రెడ్డికి భయపడి ఎన్‌డీఏను విడిచి యూపీఏలోకి తనకు తానుగా వెళ్లి శాలువాలు కప్పి నేను మీతో ఉంటా అని వేడుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారన్నారు. అవసరం వచ్చినప్పుడల్లా బీజేపీతో అంటకాగిన చంద్రబాబు… తిరిగి వైసీపీ బీజేపీకి మధ్య ఏదో ఉందని ప్రచారం చేయడం విచిత్రంగా ఉందన్నారు.

తాము బీజేపీతో కలిసే ప్రసక్తే లేదన్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తున్న సమయంలో చంద్రబాబును దింపడానికి కుట్రలు చేయాల్సిన అవసరం వైసీపీకి ఏముందని ప్రశ్నించారు. కుట్రలు చేయడం చంద్రబాబుకే అలవాటన్నారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నేతను హత్య చేసేందుకు కూడా ప్రయత్నించే నీచ స్థితికి చంద్రబాబు దిగజారారని ఆనం మండిపడ్డారు.

First Published:  17 Nov 2018 5:03 AM GMT
Next Story