Telugu Global
Cinema & Entertainment

ఇలియానాకి కం బ్యాక్ తో ఫ్లాప్

తెలుగు లో ఇలియానా చేసిన ఆఖరి సినిమా “దేవుడు చేసిన మనుషులు”. ఆ సినిమా తరువాత బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయిన ఈ భామ మళ్ళి చాలా కాలం తరువాత రవితేజ హీరో గా వచ్చిన “అమర్ అక్బర్ అంటోనీ” సినిమాలో నటించింది. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమా నిన్న ధియేటర్ లో రిలీజ్ అయ్యింది. మొదటి రోజే ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అసలు ఈ సినిమాని ధియేటర్ లో […]

ఇలియానాకి కం బ్యాక్ తో ఫ్లాప్
X

తెలుగు లో ఇలియానా చేసిన ఆఖరి సినిమా “దేవుడు చేసిన మనుషులు”. ఆ సినిమా తరువాత బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయిన ఈ భామ మళ్ళి చాలా కాలం తరువాత రవితేజ హీరో గా వచ్చిన “అమర్ అక్బర్ అంటోనీ” సినిమాలో నటించింది. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమా నిన్న ధియేటర్ లో రిలీజ్ అయ్యింది. మొదటి రోజే ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అసలు ఈ సినిమాని ధియేటర్ లో ఆడియన్స్ ఎవరు భరించలేకపోయారు.

అయితే ఈ సినిమా కోసం ఇలియానాని బాలీవుడ్ నుంచి తీసుకొచ్చారు. ఈ సినిమాతో ఇలియానా మళ్ళి తెలుగు లో ఫార్మ్ లోకి వస్తుంది అని భావించారు అంతా. కానీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇలియానాని ఎవరు పట్టించుకోలేదు. సినిమా కథలో ఇలియానాకి మంచి పాత్రే దొరికిన కూడా కథనంలో లోపాల ఉండటం మూలాన ఇలియానా పాత్ర ఎవ్వరికి అర్ధం కాకుండా పోయింది. అసలు సినిమానే ఫ్లాప్ అనుకుంటే అందులో మరి ఇలియానా పాత్ర కూడా చాలా డల్ గా ఉండటంతో ఇలియానా ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు. ఇకపోతే ఈ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన లయని కూడా సరిగ్గా వాడుకోలేకపోయాడు శ్రీనువైట్ల.

First Published:  17 Nov 2018 12:04 AM GMT
Next Story