Telugu Global
NEWS

ఐపీఎల్ -12 వేలానికి గంభీర్, యువరాజ్ సింగ్

స్టీవ్ స్మిత్, వార్నర్ లకు ఫ్రాంచైజీల గ్రీన్ సిగ్నల్ చెక్కు చెదరని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ 12వ సీజన్ కోసం వివిధ ఫ్రాంచైజీలు సన్నాహాలు ప్రారంభించాయి. వచ్చే  నెలలో జరిగే వేలానికి ముందే…తమకు అవసరమైన ఆటగాళ్లను అట్టే పెట్టుకొని… భారంగా మారిన క్రికెటర్లను వదిలించుకొన్నాయి. హీరోలు ఇక జీరోలు గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ , ఆరోన్ ఫించ్, బ్రెండన్ మెకల్లమ్, జయదేవ్ ఉనద్కత్, జెపీ డుమ్నీ లాంటి కీలకఆటగాళ్లను వివిధ […]

ఐపీఎల్ -12 వేలానికి గంభీర్, యువరాజ్ సింగ్
X
  • స్టీవ్ స్మిత్, వార్నర్ లకు ఫ్రాంచైజీల గ్రీన్ సిగ్నల్
  • చెక్కు చెదరని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్

వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ 12వ సీజన్ కోసం వివిధ ఫ్రాంచైజీలు సన్నాహాలు ప్రారంభించాయి. వచ్చే నెలలో జరిగే వేలానికి ముందే…తమకు అవసరమైన ఆటగాళ్లను అట్టే పెట్టుకొని… భారంగా మారిన క్రికెటర్లను వదిలించుకొన్నాయి.

హీరోలు ఇక జీరోలు

గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ , ఆరోన్ ఫించ్, బ్రెండన్ మెకల్లమ్, జయదేవ్ ఉనద్కత్, జెపీ డుమ్నీ లాంటి కీలకఆటగాళ్లను వివిధ ఫ్రాంచైజీలు విడిచిపెట్టాయి. ఈ మొనగాళ్లంతా… త్వరలో జరిగే వేలం ద్వారా ఏ ఫ్రాంచైజీలలో చేరతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ముంబై నుంచి ముస్తాఫిజుర్ అవుట్

మూడుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్…రోహిత్ శర్మ నాయకత్వంలోని తమజట్టులో జస్ ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, కీరాన్ పోలార్డ్, క్వింటన్ డికాక్, ఆడం మిల్నీతో పాటు.. పలువురు దేశవాళీ క్రికెటర్లను కొనసాగించాలని నిర్ణయించింది.

సౌతాఫ్రికా టీ-20 స్పెషలిస్ట్ జెపీ డుమ్నీ, పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ లను…తమ జట్టు నుంచి తప్పించి…వేలానికి అనుమతించింది.

ఢిల్లీ నుంచి గౌంభీర్ అవుట్

ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ….మహ్మద్ షమీ, గౌతం గంభీర్, జేసన్ రాయ్, డేనియల్ క్రిస్టియన్, గ్లెన్ మాక్స్ వెల్ లాంటి ఖరీదైన సీనియర్ ఆటగాళ్లను వదిలించుకొంది.

సన్ రైజర్స్ తోనే కీలక ఆటగాళ్లు

హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం…రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, కేన్ విలియమ్స్ సన్, యూసుఫ్ పఠాన్, భువనేశ్వర్ కుమార్, డేవిడ్ వార్నర్, షకీబుల్ హసన్ లను రిటెయిన్ చేసుకొంది. మొత్తం 17 మంది ఆటగాళ్లను ఉంచుకొని ..తొమ్మిదిమందిని విడిచిపెట్టింది.

చెన్నై సూపర్ కింగ్స్ సేమ్ టు సేమ్

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం..ముగ్గురు మినహా మిగిలిన ఆటగాళ్లందరినీ కొనసాగించాలని నిర్ణయించింది.

మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రం..గత సీజన్లో ఆడిన 21 మంది ఆటగాళ్లలో 13 మందిని జట్టులోనే ఉంచుకోనున్నట్లు ప్రకటించింది. మిషెల్ జాన్సన్, మిషెల్ స్టార్క్ లాంటి ఫాస్ట్ బౌలర్లను… వేలానికి అనుమతించింది.

పంజాబ్ తోనే రాహుల్

రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వంలోని కింగ్స్ పంజాబ్…యువ ఓపెనర్ లోకేశ్ రాహుల్ తో సహా తొమ్మిదిమంది ఆటగాళ్లను కొనసాగించి..మరో 11 మందిని వేలానికి విడిచిపెట్టింది.

రాజస్థాన్ కు స్టీవ్ స్మిత్….

మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్…స్టీవ్ స్మిత్ ను కొనసాగించాలని నిర్ణయించింది. అజింక్యా రహానే, గౌతమ్, సంజు శాంసన్ తో సహా పలువురు ఆటగాళ్లను తనతోనే ఉంచుకోవాలని నిర్ణయించింది.

మొత్తం మీద…త్వరలో జరిగే ఐపీఎల్ 12వ సీజన్ వేలం…ఆఖరిబంతి వరకూ ఉత్కంఠ భరితంగా సాగే టీ-20 మ్యాచ్ ను తలపించినా ఆశ్చర్యం లేదు.

First Published:  17 Nov 2018 5:00 AM GMT
Next Story