Telugu Global
Cinema & Entertainment

కాజల్ ఆ సినిమాకి "కవచం"

సాక్ష్యం సినిమాతో బెల్లంకొండకు కలిసిరాలేదు. కానీ అతడి జోరు మాత్రం తగ్గలేదు. వెంటనే మరో సినిమా రెడీ చేస్తున్నాడు. దాని పేరే కవచం. ఇన్నాళ్లూ స్టార్ డైరక్టర్ల వెంటపడిన ఈ హీరో, కవచంతో శ్రీనివాస్ అనే కొత్త కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఓవైపు బెల్లంకొండ శ్రీనివాస్ కు మార్కెట్ దారుణంగా పడిపోయింది, మరోవైపు కొత్త దర్శకుడు. దీంతో కవచం సినిమాను మార్కెట్ చేయడం నిర్మాతకు తలకుమించిన భారంగా మారింది. టీజర్ తో హైప్ తీసుకురావడానికి ప్రయత్నించారు […]

కాజల్ ఆ సినిమాకి కవచం
X

సాక్ష్యం సినిమాతో బెల్లంకొండకు కలిసిరాలేదు. కానీ అతడి జోరు మాత్రం తగ్గలేదు. వెంటనే మరో సినిమా రెడీ చేస్తున్నాడు. దాని పేరే కవచం. ఇన్నాళ్లూ స్టార్ డైరక్టర్ల వెంటపడిన ఈ హీరో, కవచంతో శ్రీనివాస్ అనే కొత్త కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఓవైపు బెల్లంకొండ శ్రీనివాస్ కు మార్కెట్ దారుణంగా పడిపోయింది, మరోవైపు కొత్త దర్శకుడు. దీంతో కవచం సినిమాను మార్కెట్ చేయడం నిర్మాతకు తలకుమించిన భారంగా మారింది.

టీజర్ తో హైప్ తీసుకురావడానికి ప్రయత్నించారు కానీ, ఆ టీజర్ కూడా పరమ రొటీన్ గా ఉండడంతో బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి తనకు బాగా పరిచయమైన అభిషేక్ పిక్చర్స్ చెంతకు కవచం చేరినట్టు కనిపిస్తోంది.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తాజాగా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 7న కవచం సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈలోగా ఈ సినిమా బిజినెస్ కంప్లీట్ అవుతుందో లేదో చూడాలి. ఉన్నంతలో ఈ సినిమాకు ఉన్న ఒకే ఒక్క మేజర్ హైలెట్ కాజల్. ఆమె స్టార్ డమ్ మాత్రమే ఈ సినిమాకు కవచం.

First Published:  16 Nov 2018 10:51 PM GMT
Next Story