Telugu Global
Cinema & Entertainment

ఆ పాత్రలు అస్సలు చెయ్యను కీర్తి సురేష్

2013 లో వచ్చిన “గీతాంజలి” అనే మలయాళ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తరువాత మెల్లగా తమిళ్ లో సినిమాలు చేస్తూ “నేను శైలజ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. తెలుగు ఇండస్ట్రీ కి వచ్చిన మూడేళ్ళలోనే ఈ భామ హీరోయిన్ గా నటిగా మంచి పేరు తెచ్చుకుంది, పైగా కీర్తి సురేష్ కి “మహానటి” వంటి కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ కూడా ఉంది. […]

ఆ పాత్రలు అస్సలు చెయ్యను కీర్తి సురేష్
X

2013 లో వచ్చిన “గీతాంజలి” అనే మలయాళ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తరువాత మెల్లగా తమిళ్ లో సినిమాలు చేస్తూ “నేను శైలజ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. తెలుగు ఇండస్ట్రీ కి వచ్చిన మూడేళ్ళలోనే ఈ భామ హీరోయిన్ గా నటిగా మంచి పేరు తెచ్చుకుంది, పైగా కీర్తి సురేష్ కి “మహానటి” వంటి కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ కూడా ఉంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చి తమిళ్ సినిమాలు మాత్రమే చేస్తుంది. అయితే కీర్తి సురేష్ ఇప్పటి వరకు ఒక్క గ్లామర్ రోల్ లో కూడా నటించలేదు. దీని పై కీర్తి సురేష్ స్పందిస్తూ “నేను డీ గ్లామర్ రోల్స్ అయిన చేస్తాను గాని గ్లామర్ రోల్స్ మాత్రం అస్సలు చెయ్యను. ఎందుకంటే అసలు ప్రొడ్యూసర్స్ నన్ను అలాంటి పాత్రల్లో నటించమని కూడా అడగరు” అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. కానీ కొంత మంది తెలుగు ప్రొడ్యూసర్స్ మాత్రం కీర్తి సురేష్ తో గ్లామర్ రోల్స్ చేయించాలి అని ట్రై చేస్తున్నారు. మరి ఫ్యూచర్ లో కీర్తి గ్లామర్ రోల్స్ కి ఒప్పుకుంటుందో లేదో.

First Published:  17 Nov 2018 4:26 AM GMT
Next Story