Telugu Global
NEWS

కూట‌మిలో కాంగ్రెస్ యాడ్ వివాదం !

ప్ర‌జా కూట‌మిలో కొత్త చిచ్చు రేగింది. ఫొటోల‌పై ర‌గ‌డ మొద‌లైంది. కాంగ్రెస్ ఓ తెలుగు దిన‌ప‌త్రిక‌లో ఇచ్చిన యాడ్ ఇప్పుడు దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌క‌ట‌న ఇచ్చారు. అయితే ఈ యాడ్ లో కాంగ్రెస్ నేత‌లు సోనియా, రాహుల్ ఫొటోలు ఉంటాయి. అదీ కామ‌న్‌. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సాధార‌ణంగా ఉంటారు. అంతే నేచుర‌ల్‌గా సీఎల్పీ నేత జానారెడ్డి, మండ‌లి నేత ష‌బ్బీర్ అలీ ఉంటారు. వాళ్లు ఉండ‌డంలో […]

కూట‌మిలో కాంగ్రెస్ యాడ్ వివాదం !
X

ప్ర‌జా కూట‌మిలో కొత్త చిచ్చు రేగింది. ఫొటోల‌పై ర‌గ‌డ మొద‌లైంది. కాంగ్రెస్ ఓ తెలుగు దిన‌ప‌త్రిక‌లో ఇచ్చిన యాడ్ ఇప్పుడు దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌క‌ట‌న ఇచ్చారు. అయితే ఈ యాడ్ లో కాంగ్రెస్ నేత‌లు సోనియా, రాహుల్ ఫొటోలు ఉంటాయి. అదీ కామ‌న్‌. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సాధార‌ణంగా ఉంటారు. అంతే నేచుర‌ల్‌గా సీఎల్పీ నేత జానారెడ్డి, మండ‌లి నేత ష‌బ్బీర్ అలీ ఉంటారు. వాళ్లు ఉండ‌డంలో త‌ప్పు లేదు.

కాంగ్రెస్ యాడ్ కాబ‌ట్టి పార్టీ ప్రోటోకాల్ ప్ర‌కారం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్ర‌భాక‌ర్‌, రేవంత్ రెడ్డి ఫొటోలు వేశారు. వారి త‌ర్వాత స్టార్ క్యాంపెయిన‌ర్ విజ‌య‌శాంతికి స్థానం ఇచ్చారు. డీకే అరుణ ఫొటో పెట్టారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కాబ‌ట్టి త‌ప్పులేదు.

ఇక ప్ర‌జా కూట‌మిలోని ఇత‌ర పార్టీల నేత‌లైన టీడీపీ అధినేత చంద్ర‌బాబు, టీజేఎస్ నేత కోదండ‌రాం ఫొటోలు పెట్టారు. అంతేకాదు ఎన్టీఆర్ ఫొటోకు స్థానం క‌ల్పించారు. కాంగ్రెస్ ప్ర‌చార యాడ్‌లో ఈ ముగ్గురు ఫోటోలు పెట్ట‌డం ఏంట‌ని ఒకే విమ‌ర్శ చెల‌రేగితే… కూట‌మిలో రెండు పార్టీలకు చెందిన ఇద్ద‌రు నేత‌లు ఫోటోలు పెట్టి… సీపీఐ నేత‌లు ఫొటోలు పెట్ట‌క పోవ‌డం ఏంట‌నీ మరో విమ‌ర్శ మొద‌లైంది.

సీపీఐ జాతీయ నేత సుర‌వ‌రం సుధాక‌ర్‌రెడ్డి తెలుగువాడే. కానీ చాడ‌వెంక‌ట‌రెడ్డి, సుర‌వ‌రం ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రి ఫోటో పెట్టాలి క‌దా? అని సీపీఐ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలోనే కాదు… కూట‌మిలోనూ ఈ యాడ్ ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ప్ర‌చార‌కమిటీ ప్ర‌క‌టించిన షెడ్యూల్‌లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు మిస్ అయ్యాయి. రేవంత్‌వ‌ర్గానికి చెందిన నేత‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చార క‌మిటీ ప్ర‌చారం చేయ‌డం లేదని ఈ షెడ్యూల్ ప్ర‌కారం తెలుస్తోంది.

కరీంన‌గ‌ర్‌, మాన‌కొండూరులో ప్ర‌చారం చేసే ప్ర‌చార క‌మిటీ…ప‌క్క‌నే రేవంత్ వ‌ర్గం నేత విజ‌య‌ర‌మ‌ణారావు ఉన్న పెద్ద‌ప‌ల్లికి మాత్రం వెళ్ల‌డం లేదు. అంటే నాలుగు టీమ్‌లు…. త‌మ త‌మ వ‌ర్గాల ప్ర‌కారం నియోక‌వ‌ర్గాల‌ను విభ‌జించికున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ప్ర‌క‌ట‌న ఇప్పుడు కూట‌మిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

First Published:  17 Nov 2018 12:18 AM GMT
Next Story