Telugu Global
Cinema & Entertainment

భారతీయుడు 2″ లో తెలుగు స్టార్ హీరో

కమల హసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “భారతీయుడు”. ఈ సినిమా అప్పట్లో భారీ హిట్ గా నిలిచి పెను సంచలనాలు క్రియేట్ చేసింది. మళ్ళి ఇన్నేళ్ళ తరువాత ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది. “భారతీయుడు 2” పేరు వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో, కమల్ తో పాటు ఇప్పటికే మలయాళ యువ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు మరో […]

భారతీయుడు 2″ లో తెలుగు స్టార్ హీరో
X
  1. కమల హసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “భారతీయుడు”. ఈ సినిమా అప్పట్లో భారీ హిట్ గా నిలిచి పెను సంచలనాలు క్రియేట్ చేసింది. మళ్ళి ఇన్నేళ్ళ తరువాత ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది. “భారతీయుడు 2” పేరు వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాలో, కమల్ తో పాటు ఇప్పటికే మలయాళ యువ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు మరో కోలీవుడ్ హీరో శింబు కూడా ఈ సినిమాలో అవకాశం దక్కించుకున్నాడట. అవినీతి వ్యతిరేకంగా వ్యక్తి చేసే పోరాటమే భారతీయుడు కథ. అలాంటి కథతోనే మరోసారి “భారతీయుడు 2” తో వస్తున్నాడు శంకర్. కమల్ తో పాటుగా దుల్కర్ సల్మాన్, శింబు ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇక తెలుగు నుంచి ఒక స్టార్ హీరోని ఈ సినిమాలో జత చేయాలి అని చూస్తున్నాడు డైరెక్టర్ శంకర్.

ఇప్పటికే ఒకరు ఇద్దరు స్టార్ హీరోస్ తో కూర్చొని శంకర్ డిస్కస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ తెలుగు స్టార్ హీరో గనక ఈ సినిమా ఒప్పుకుంటే తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా మంచి క్రేజీ మల్టీస్టారర్ అవుతుంది. త్వరలో ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది.

First Published:  16 Nov 2018 10:05 PM GMT
Next Story