Telugu Global
Cinema & Entertainment

రామ్ కు జ్ఞానోదయం అయింది

దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది హలో గురు ప్రేమకోసమే సినిమా. రిలీజైన మొదటి రోజే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ రామ్ మాత్రం ఒప్పుకోలేదు. సినిమా సూపర్ హిట్ అంటూ అప్పట్లో తనకుతానుగా ప్రకటించుకున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఈ సినిమా ఎప్పుడో థియేటర్ల నుంచి ఖాళీ చేసింది. అలా వెళ్లిపోయిన ఇన్నాళ్లకు నిజం ఒప్పుకున్నాడు రామ్. “అన్నంతగా సాటిస్ పై చేయలేకపోయినా సపోర్ట్ చేసి హలో గురు […]

రామ్ కు జ్ఞానోదయం అయింది
X

దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది హలో గురు ప్రేమకోసమే సినిమా. రిలీజైన మొదటి రోజే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ రామ్ మాత్రం ఒప్పుకోలేదు. సినిమా సూపర్ హిట్ అంటూ అప్పట్లో తనకుతానుగా ప్రకటించుకున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఈ సినిమా ఎప్పుడో థియేటర్ల నుంచి ఖాళీ చేసింది. అలా వెళ్లిపోయిన ఇన్నాళ్లకు నిజం ఒప్పుకున్నాడు రామ్.

“అన్నంతగా సాటిస్ పై చేయలేకపోయినా సపోర్ట్ చేసి హలో గురు ప్రేమకోసమే సినిమాను హిట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మరీ ముఖ్యంగా నా ఫ్యాన్స్ కు ఐ లవ్ యు. ఈసారి వడ్డీతో పాటు తిరిగిచ్చేస్తా.”

రామ్ చేసిన ట్వీట్ ఇది. ఈ సినిమాను హిట్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతూనే, సినిమా ఆశించిన స్థాయిలో లేదని ఒప్పుకున్నాడు రామ్. ఈసారి కచ్చితంగా ఓ హిట్ ఇస్తా అనే అర్థం వచ్చేలా ట్వీటాడు. హలో గురు ప్రేమకోసమే సినిమా దెబ్బతో ఈ హీరో ఇప్పటివరకు తన కొత్త సినిమాను ప్రకటించలేదు.

First Published:  18 Nov 2018 2:01 AM GMT
Next Story