చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా భర్త

రాజకీయాలకు దూరంగా ఉండే ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి తొలిసారిగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నగరిలో జరిగిన కార్యక్రమంలో రోజాతో కలిసి పాల్గొన్న ఆయన… చంద్రబాబుకు సిగ్గు, శరంలాంటివి ఏమీ లేవన్నారు. ఒకప్పుడు చంద్రబాబుకు ఇప్పటి చంద్రబాబుకు ఎంతో తేడా ఉందన్నారు.

చంద్రబాబు ఒక నమ్మకద్రోహి అని అభివర్ణించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. 2004లో చంద్రబాబును తాను కూడా ఎంతో అభిమానించానని…కానీ ఆయన నిజస్వరూపం తెలిసిన తర్వాత అసహ్యం ఏర్పడిందన్నారు.

రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు టీడీపీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసిందని ఎమ్మెల్యే రోజా చెప్పారు. దొంగలు, రౌడీలే జన్మభూమి కమిటీ సభ్యులుగా ఉన్నారన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తాను చేసిన అభివృద్ధి పనులను వివరించేందుకు ఎమ్మెల్యే రోజా… ”మై ఎమ్మెల్యే యాప్‌”ను ప్రారంభించారు.