Telugu Global
Cinema & Entertainment

'ఎన్టీఆర్'లో సమంత

బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమాలో సమంత కూడా నటించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో విద్యాబాలన్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సమంత కూడా చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కేవలం 2 రోజుల కాల్షీట్లు ఇస్తే చాలట. సమంత పోర్షన్ కంప్లీట్ అయిపోతుందని చెబుతున్నారు మేకర్స్. ప్రస్తుతం ఆ దిశగా చర్చలు జరుపుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించబోతోంది. ఇక శ్రీదేవిగా […]

ఎన్టీఆర్లో సమంత
X

బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమాలో సమంత కూడా నటించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో విద్యాబాలన్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సమంత కూడా చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కేవలం 2 రోజుల కాల్షీట్లు ఇస్తే చాలట. సమంత పోర్షన్ కంప్లీట్ అయిపోతుందని చెబుతున్నారు మేకర్స్. ప్రస్తుతం ఆ దిశగా చర్చలు జరుపుతున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించబోతోంది. ఇక శ్రీదేవిగా రకుల్, జయప్రదగా తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, జమున పాత్ర కోసం సమంతను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య సరసన ఓ సినిమాలో నటిస్తోంది సమంత. 2 రోజుల కాల్షీట్లు కేటాయించడం ఆమెకు పెద్ద సమస్య కాదు. పారితోషికం సెట్ అయితే ప్రాజెక్టు ఓకే అయినట్టే.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఇక ఎన్టీఆర్-మహానాయకుడు సినిమాను ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్ చేయబోతున్నారు.

First Published:  18 Nov 2018 1:02 AM GMT
Next Story