Telugu Global
Cinema & Entertainment

కిస్సెస్ కాకుండా మరొకటి ఉందట

“కుమారి 21 ఎఫ్” అనే సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ హేబ్బా పటేల్. కానీ ఆ సినిమా ఇచ్చిన క్రేజ్ హేబ్బా పటేల్ కి ఎంతో కాలం నిలువలేదు. ఎందుకంటే ఆ తరువాత హేబ్బా పటేల్ చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ గా నిలిచాయి. అయితే హేబ్బా పటేల్ నుంచి వస్తున్నా లేటెస్ట్ సినిమా “24 కిస్సెస్”. ఈ సినిమాలో హేబ్బా పటేల్ మరో హాట్ అవతార్ లో కనిపించి ముద్దులతో రచ్చ చేస్తుంది అని […]

కిస్సెస్ కాకుండా మరొకటి ఉందట
X

“కుమారి 21 ఎఫ్” అనే సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ హేబ్బా పటేల్. కానీ ఆ సినిమా ఇచ్చిన క్రేజ్ హేబ్బా పటేల్ కి ఎంతో కాలం నిలువలేదు. ఎందుకంటే ఆ తరువాత హేబ్బా పటేల్ చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ గా నిలిచాయి. అయితే హేబ్బా పటేల్ నుంచి వస్తున్నా లేటెస్ట్ సినిమా “24 కిస్సెస్”.

ఈ సినిమాలో హేబ్బా పటేల్ మరో హాట్ అవతార్ లో కనిపించి ముద్దులతో రచ్చ చేస్తుంది అని తెలియగానే ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆ ముద్దులు అనేది కేవలం ప్రేక్షకులని ధియేటర్స్ కి రప్పించడానికే అంటుంది హేబ్బా పటేల్. ఈ విషయం గురించి హేబ్బా పటేల్ మాట్లాడుతూ “24 కిస్సెస్ సినిమా చూస్తే ముద్దులకు కథలో ఎంత ప్రాధాన్యం ఉందో తెలుస్తుంది. ‘24 కిస్సెస్’ సినిమాకు సంబంధించి ముద్దుల మీదే ప్రేక్షకుల అటెన్షన్ ఉంది. ఇందుకు ప్రేక్షకులను తప్పు పట్టలేం. ఇందులో నేను హీరోయిన్‌ కాకపోతే… నేనూ అలాగే ఆలోచించేదాన్ని. ఐతే సినిమా మార్కెటింగ్‌ స్ట్రాటజీల్లో ఇదొకటి. ప్రేక్షకులు సినిమాలో ఓ విషయం ఉందని ఆశిస్తారు అది చూసి ధియేటర్ కి వస్తారు. థియేటర్లలో అంతకుమించి మరో విషయాన్ని చూస్తారు. ముద్దులతో పాటు అద్భుతమైన కథ ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది ఈ కుమారి.

First Published:  18 Nov 2018 10:55 PM GMT
Next Story