Telugu Global
NEWS

బాబు ఊసు ఎత్తని జూనియర్ ఎన్టీఆర్ ! ప్రచారానికీ నో !

తమ సోదరి తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్ పల్లి ఎమ్మెల్యేగా బరిలోకి దిగడంపై నందమూరి హీరోలు స్పందిస్తూ పెట్టిన ట్వీట్ ఆసక్తిదాయకంగా ఉంది. కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఈ విషయంలో స్పందించారు. ఆమెకు బెస్ట్ విషెస్ చెప్పారు. అయితే ఈ ట్వీట్ ను పరిశీలించి చూస్తే ఆసక్తిదాయం. ఎందుకంటే.. హరికృష్ణ కూతురుకు చంద్రబాబు నాయుడు టికెట్ ఖరారు చేశాడు కాబట్టి.. ఇక నుంచి హరి ఫ్యామిలీ బాబుకు దాసోహం అని, జూనియర్ ఎన్టీఆర్ కూడా […]

బాబు ఊసు ఎత్తని జూనియర్ ఎన్టీఆర్ ! ప్రచారానికీ నో !
X

తమ సోదరి తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్ పల్లి ఎమ్మెల్యేగా బరిలోకి దిగడంపై నందమూరి హీరోలు స్పందిస్తూ పెట్టిన ట్వీట్ ఆసక్తిదాయకంగా ఉంది. కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఈ విషయంలో స్పందించారు. ఆమెకు బెస్ట్ విషెస్ చెప్పారు.

అయితే ఈ ట్వీట్ ను పరిశీలించి చూస్తే ఆసక్తిదాయం.

ఎందుకంటే.. హరికృష్ణ కూతురుకు చంద్రబాబు నాయుడు టికెట్ ఖరారు చేశాడు కాబట్టి.. ఇక నుంచి హరి ఫ్యామిలీ బాబుకు దాసోహం అని, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇక బాబు చెప్పినట్టుగా వినాల్సిందేనని కొంతమంది విశ్లేషించారు. బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించాడని కూడా అభిప్రాయపడ్డారు.

అయితే…. తారక్ తన ట్వీట్లో మాత్రం చంద్రబాబు ఊసే ఎత్తలేదు. తన తాత స్థాపించిన పార్టీ , తన తండ్రి సేవలు అందించిన పార్టీ అంటూ…. టీడీపీ గురించి చెప్పుకొచ్చిన హరి కృష్ణ తనయులు.. తమ మామ ప్రస్తావన మాత్రం తమ ట్వీట్లో తీసుకురాలేదు.
చంద్రబాబు ఆశీస్సులు అంటూ మాటెత్తలేదు. తమ సోదరికి బెస్ట్ విషెస్ చెప్పిన తారక్.. ఆమెను దగ్గరుండి గెలిపించుకుంటామని మాత్రం అనలేదు. ఆమె తరఫున ప్రచారానికి వస్తామని ప్రకటించలేదు.

ఇక నందమూరి సుహాసిని కూడా తన తరఫున తారక్ ప్రచారానికి వస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేయలేకపోయింది. దీన్ని బట్టి ఆమె తరఫున తారక్ ప్రచారానికి వచ్చే అవకాశాలు లేవనే అనుకుంటున్నారు.

చంద్రబాబు ప్రస్తావన కానీ, కూటమి ప్రస్తావన కానీ.. తేని జూనియర్‌ ఎన్టీఆర్ మహాకూటమి తరఫున తెలంగాణలో ప్రచారం చేసేది ఉండదని మాత్రం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  19 Nov 2018 12:15 AM GMT
Next Story