Telugu Global
NEWS

కేసీఆర్ మార్క్ రాజకీయం.... నాయిని చేతే బీఫారం....

అది 2014.. తెలంగాణ రాష్ట్రసమితి తెలంగాణలో అధికారం చేపట్టింది. అస్సలు ఆశలు లేని స్థితిలో వచ్చిన బోటాబోటీ విజయంతో టీఆర్ఎస్ గద్దెనెక్కింది. కనీసం మంత్రి పదవులు కట్టబెట్టేందుకు కూడా అనుభవం లేని ఎమ్మెల్యేలున్న నేపథ్యంలోనే అస్సలు ఎమ్మెల్యేగా కూడా గెలవని టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డికి కేసీఆర్ ఏకంగా హోం మంత్రి పదవిని కట్టబెట్టి సముచిత గౌరవం కల్పించారు. టీఆర్ఎస్ లో సీనియర్ నేతగా.. ఆది నుంచి కేసీఆర్ వెంట నడిచిన నాయినికి కేసీఆర్ ఇచ్చిన […]

కేసీఆర్ మార్క్ రాజకీయం.... నాయిని చేతే బీఫారం....
X

అది 2014.. తెలంగాణ రాష్ట్రసమితి తెలంగాణలో అధికారం చేపట్టింది. అస్సలు ఆశలు లేని స్థితిలో వచ్చిన బోటాబోటీ విజయంతో టీఆర్ఎస్ గద్దెనెక్కింది.

కనీసం మంత్రి పదవులు కట్టబెట్టేందుకు కూడా అనుభవం లేని ఎమ్మెల్యేలున్న నేపథ్యంలోనే అస్సలు ఎమ్మెల్యేగా కూడా గెలవని టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డికి కేసీఆర్ ఏకంగా హోం మంత్రి పదవిని కట్టబెట్టి సముచిత గౌరవం కల్పించారు.

టీఆర్ఎస్ లో సీనియర్ నేతగా.. ఆది నుంచి కేసీఆర్ వెంట నడిచిన నాయినికి కేసీఆర్ ఇచ్చిన గుర్తింపుపై అప్పట్లో పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ తనకు ఇచ్చిన ప్రాధాన్యంపై నాయిని కూడా పలు వేదికల్లో కృతజ్ఞత చూపారు.

కానీ ఇప్పుడు కాలం మారింది. టీఆర్ఎస్ రెండో సారి తెలంగాణ బరిలో నిలుస్తోంది. అప్పుడు ఉద్యమ వేడి.. ఇప్పుడు కాసింత అసమ్మతి వేడి.. అందుకే జాగ్రత్తగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు కేసీఆర్.

తనకు ఎంతో ఆప్త మిత్రుడైన నాయిని నర్సింహారెడ్డి ఎంత పట్టుబట్టినప్పటికీ ఆయనకు ముషీరాబాద్ నియోజకవర్గ టికెట్ ఇవ్వకుండా ఏకంగా అక్కడ గెలిచే అవకాశాలున్న టీఆర్ఎస్ నేత ముఠా గోపాల్ కు టికెట్ ను ఖరారు చేశారు కేసీఆర్.

విచిత్రం ఏంటంటే.. ముషీరాబాద్ టికెట్ కోసం నాయిని ఏకంగా కేసీఆర్ పై అప్పట్లో పలు విమర్శలు కూడా చేశారు. నాకు కూడా కలవడానికి కేసీఆర్ సమయం ఇవ్వడం లేదని.. అప్పట్లో 10 కోట్లు ఇస్తా పోటీచేయడానికి వేరే సీటు ఎంచుకో అన్నాడని నోరు జారాడు.

కానీ తర్వాత కేసీఆర్ రంగంలోకి దిగి నాయినిని చల్లబరిచాడు. 2014లో సముచిత గౌరవమిచ్చానని.. ఈసారి పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో సహకరించాలని కోరినట్టు తెలిసింది.

అందుకే పార్టీ నిర్ణయానుసారం నాయిని కూడా కేసీఆర్ మాటకు తలొగ్గి.. తన అల్లుడికి ఆశించిన ముషీరాబాద్ టికెట్ ను టీఆర్ఎస్ నేత ముఠా గోపాల్ కు కట్టబెట్టారు.

అంతేకాదు.. స్వయంగా అరమరికలు.. అసమ్మతికి తావు లేకుండా తన చేతుల మీదుగానే బీఫారం అందజేసి అసమ్మతికి నాయిని తెరదించారు. టీఆర్ఎస్ లోని అసమ్మతి జ్వాలలను కేసీఆర్ సద్దుమణించిన తీరు చూసి టీఆర్ఎస్ నేతలే షాక్ కు గురయ్యారని తెలిసింది.

First Published:  19 Nov 2018 1:50 AM GMT
Next Story