Telugu Global
Cinema & Entertainment

అందుకే నదియా'ని తప్పించారు...

సీనియర్ హీరోయిన్ అయిన నదియా తెలుగులోకి “మిర్చి” “అత్తారింటికి దారేది” సినిమాలతో తన సెకండ్ ఇనింగ్స్ ని స్టార్ట్ చేసింది. అయితే ఇన్నేళ్ళ కెరీర్ లో ఎప్పుడు ఒకరిచేత మాట అనిపించుకొని నదియా ఒక డైరెక్టర్ చేతుల్లో అవమానించబడింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఒక తమిళ సినిమాలో దర్శకుడు మిస్కిన్ తో పాటుగా నదియా కూడా నటిస్తోంది. షూటింగ్ లో భాగంగా మిస్కిన్ ని నదియా కొట్టాలి , అయితే అలా కొట్టే సీన్ తీస్తున్నప్పుడు […]

అందుకే నదియాని తప్పించారు...
X

సీనియర్ హీరోయిన్ అయిన నదియా తెలుగులోకి “మిర్చి” “అత్తారింటికి దారేది” సినిమాలతో తన సెకండ్ ఇనింగ్స్ ని స్టార్ట్ చేసింది. అయితే ఇన్నేళ్ళ కెరీర్ లో ఎప్పుడు ఒకరిచేత మాట అనిపించుకొని నదియా ఒక డైరెక్టర్ చేతుల్లో అవమానించబడింది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఒక తమిళ సినిమాలో దర్శకుడు మిస్కిన్ తో పాటుగా నదియా కూడా నటిస్తోంది. షూటింగ్ లో భాగంగా మిస్కిన్ ని నదియా కొట్టాలి , అయితే అలా కొట్టే సీన్ తీస్తున్నప్పుడు సరిగా కొట్టలేక పోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 56 సార్లు మిస్కిన్ ని చెంప మీద కొట్టింది నదియా, అయితే దర్శకుడు అనుకున్న స్థాయిలో ఆ సీన్ రాకపోవడంతో మిస్కిన్ కు కోపం వచ్చి నదియా ని తిట్టాడట. దాంతో అవమానంగా భావించిన నదియా మీ సినిమాలో నటించడం నా వల్ల కాదు అంటూ తప్పుకుందట. నదియా స్థానంలో రమ్యకృష్ణ ని ఆ పాత్రలో తీసుకోగా కేవలం రెండే షాట్ లలో మిస్కిన్ చెంప పగులగొట్టి దర్శకుడిని మెప్పించింది అంట రమ్యక్రిష్ణ. ఆ విధంగా ఒక డైరెక్టర్ చేతిలో అవమానించబడింది నదియా.

First Published:  19 Nov 2018 2:44 AM GMT
Next Story