Telugu Global
NEWS

ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్

31వేల 258 బాల్స్ ఎదుర్కొన్న ఏకైక క్రికెటర్ జిడ్డాటలో మొనగాడు రాహుల్ ద్రావిడ్ రాహుల్ ఘనతను అభిమానులకు గుర్తు చేసిన బీసీసీఐ రాహుల్ ద్రావిడ్…అనగానే…టెస్ట్ క్రికెట్లో భారత క్రికెట్ గోడ అన్నమాటే అభిమానులకు గుర్తుకు వస్తుంది. కేవలం సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ కోసమే పుట్టిన ఆటగాడు రాహుల్ ద్రావిడ్. భారత క్రికెట్ …ప్రపంచానికి అందించిన అత్యుత్తమ, అసాధారణ వన్ డౌన్ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ మాత్రమే. ఒకే ఒక్కడు…. తన కెరియర్ లో…అత్యధిక బంతులు ఎదుర్కొన్న బ్యాట్స్ […]

ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్
X
  • 31వేల 258 బాల్స్ ఎదుర్కొన్న ఏకైక క్రికెటర్
  • జిడ్డాటలో మొనగాడు రాహుల్ ద్రావిడ్
  • రాహుల్ ఘనతను అభిమానులకు గుర్తు చేసిన బీసీసీఐ

రాహుల్ ద్రావిడ్…అనగానే…టెస్ట్ క్రికెట్లో భారత క్రికెట్ గోడ అన్నమాటే అభిమానులకు గుర్తుకు వస్తుంది. కేవలం సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ కోసమే పుట్టిన ఆటగాడు రాహుల్ ద్రావిడ్.

భారత క్రికెట్ …ప్రపంచానికి అందించిన అత్యుత్తమ, అసాధారణ వన్ డౌన్ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ మాత్రమే.

ఒకే ఒక్కడు….

తన కెరియర్ లో…అత్యధిక బంతులు ఎదుర్కొన్న బ్యాట్స్ మన్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పిన రాహుల్ ద్రావిడ్ ఘనతను … బీసీసీఐ మరోసారి…ప్రస్తుత తరం క్రికెట్ అభిమానులకు గుర్తు చేసింది.

రాహుల్ ద్రావిడ్ తన టెస్ట్ కెరియర్ లో ప్రపంచ మేటి బౌలర్లను దీటుగా ఎదుర్కొని 13వేల 288 పరుగులతో 52. 31 సగటు సాధించాడు. ద్రావిడ్ క్రీజులోకి వచ్చాడంటే… ఫెవికాల్ అంటించుకొని..బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టే ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

31వేల 258 బాల్స్ లో 13వేల పరుగులు

ద్రావిడ్ తన కెరియర్ లో 31వేల 258 బాల్స్ ఎదుర్కొన్నా డు. టెస్ట్ చరిత్రలోనే ఇన్ని బంతులు ఎదుర్కొన్న మరో బ్యాట్స్ మన్ వేరెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు.

చివరకు 200 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన మాస్టర్ సచిన్ టెండుల్కర్ సైతం ..31వేల బంతులు ఎదుర్కొనలేదంటే ఆశ్చర్యపోవాల్సిందే మరి.

నయావాల్ చతేశ్వర్ పూజారా

ద్రావిడ్ వారసుడిగా భారత క్రికెట్లో అడుగుపెటిన నయావాల్ చతేశ్వర్ పూజారా…రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 525 బాల్స్ ఎదుర్కొని…. 202 పరుగులు సాధించడం ద్వారా వారేవ్వా అనిపించుకొన్నాడు.

20 ఓవర్లు…అరవై థ్రిల్స్ గా సాగుతున్న నేటితరం క్రికెట్ అభిమానులుకు..ఐదురోజులపాటు సాగే టెస్ట్ క్రికెట్లో ఒక్కో క్రికెటర్ తొలి పరుగు కోసం 60 బాల్స్ జిడ్డాట ఆడేవారున్నారని తెలియకపోవచ్చు.

గంటలు, రోజుల తరబడి క్రీజునే అంటిపెట్టుకొని..జిడ్డాట ఆడుతూ…జట్టుకు గట్టిపునాది వేసే రాహుల్ ద్రావిడ్ లాంటి అరుదైన ఆటగాడిని చూడాలంటే…ఎంతకాలం వేచిచూడాలో మరి.

First Published:  19 Nov 2018 8:30 PM GMT
Next Story