Telugu Global
NEWS

బాల్ బాయ్ నుంచి భారత హాకీ ప్లేయర్ గా హార్థిక్ సింగ్

2018 ప్రపంచకప్ హాకీలో భారతజట్టు సభ్యుడిగా హార్థిక్ సింగ్ డిఫెన్సివ్ మిడ్ ఫీల్డర్ గా హార్థిక్ సింగ్ కు భారతజట్టులో చోటు జాతీయ, అంతర్జాతీయ పోటీలు జరిగే సమయంలో బంతులు అందించడానికి సహాయకులుగా ఉండే బాల్ బాయ్స్…ఆ తర్వాతి కాలంలో అంతర్జాతీయ ప్లేయర్లుగా ఎదగడం క్రికెట్ , టెన్నిస్ లాంటి క్రీడల్లో మాత్రమే కాదు… జాతీయ క్రీడ హాకీలో సైతం చోటు చేసుకొంది. అంచెలంచెలుగా… భువనేశ్వర్ వేదికగా ఈనెల 28 నుంచి జరిగే 2018 ప్రపంచ హాకీ పోటీలలో […]

బాల్ బాయ్ నుంచి భారత హాకీ ప్లేయర్ గా హార్థిక్ సింగ్
X
  • 2018 ప్రపంచకప్ హాకీలో భారతజట్టు సభ్యుడిగా హార్థిక్ సింగ్
  • డిఫెన్సివ్ మిడ్ ఫీల్డర్ గా హార్థిక్ సింగ్ కు భారతజట్టులో చోటు

జాతీయ, అంతర్జాతీయ పోటీలు జరిగే సమయంలో బంతులు అందించడానికి సహాయకులుగా ఉండే బాల్ బాయ్స్…ఆ తర్వాతి కాలంలో అంతర్జాతీయ ప్లేయర్లుగా ఎదగడం క్రికెట్ , టెన్నిస్ లాంటి క్రీడల్లో మాత్రమే కాదు… జాతీయ క్రీడ హాకీలో సైతం చోటు చేసుకొంది.

అంచెలంచెలుగా…

భువనేశ్వర్ వేదికగా ఈనెల 28 నుంచి జరిగే 2018 ప్రపంచ హాకీ పోటీలలో పాల్గొనే ఆతిథ్య భారతజట్టులో…డిఫెన్సివ్ మిడ్ ఫీల్డర్ గా చోటు సంపాదించిన 19 ఏళ్ల హార్థిక్ సింగ్.. బాల్ బాయ్ గానే తన క్రీడాజీవితం మొదలు పెట్టి…భారతజట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా సాధన చేసి…. ఆశించిన ఫలితం సాధించాడు.

ఖుస్రో పూర్ టు మొహాలీ…

జలంధర్ సమీపంలోని ఖుస్రోపూర్ గ్రామానికి చెందిన హార్థిక్ కు బాల్యం నుంచి హాకీ అంటే ఎంతో ఇష్టం. పైగా భారత మాజీ హాకీ స్టార్ ప్లేయర్ జుగ్ రాజ్ సింగ్ సైతం… తనకు బంధువు కావడంతో…. హార్థిక్ సింగ్… హాకీనే తన జీవితంగా చేసుకొని సాధన చేశాడు.

2013లో తొలిసారిగా నిర్వహించిన ఇండియా హాకీలీగ్ టోర్నీలో…హార్థిక్ బాల్ బాయ్ గా పనిచేశాడు. అదే సమయంలో…. ఎప్పటికైనా భారత జాతీయ జట్టులో చోటు సంపాదించాలని 15 ఏళ్ల వయసులోనే హార్థిక్ గట్టిగా నిర్ణయించుకొన్నాడు.

భారత వైస్ కెప్టెన్ గా…

ఆ తర్వాత తన గ్రామం నుంచి వచ్చి మొహాలీ హాకీ అకాడమీలో చేరాడు. నాలుగేళ్లపాటు శిక్షణ పొందటం ద్వారా ప్రతిభావంతుడైన ఆటగాడిగా రూపుదిద్దుకొన్నాడు. భారత సబ్ జూనియర్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.

2016 సబ్- జూనియర్ ఆసియాకప్ లో భారత్ బంగారు పతకం గెలుచుకోడంలో హార్థిక్ ప్రధానపాత్ర వహించాడు. దాంతో…హాకీ ఇండియా లీగ్ వేలంలో… హార్థిక్ హాట్ కేకులా మారిపోయాడు.

2వేల 600 డాలర్ల కనీస ధరతో ప్రారంభమైన వేలంలో హార్థిక్ ను పంజాబ్ వారియర్స్ ఏకంగా 39వేల డాలర్ల ధరకు కొనుగోలు చేసింది.

ఆ తర్వాత భారత జూనియర్ జట్టులో చోటు సంపాదించిన హార్ధిక్…స్పెయిన్ వేదికగా జరిగిన నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నీలో సైతం.. పాల్గొన్నాడు.

ప్రపంచకప్ జట్టులో చోటు….

అయితే…భారత సీనియర్ జట్టులో చోటు కోసం హార్థిక్ ఓపికగా ఎదురుచూడాల్సి వచ్చింది. చివరకు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ప్రాబబుల్స్ లో హార్థిక్ చోటు సంపాదించాడు.

భువనేశ్వర్ వేదికగా మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్ హాకీలో… భారతజట్టులో సభ్యుడిగా హార్థిక్ పోటీకి దిగబోతున్నాడు.

జుగ్ రాజ్ సింగ్ సలహాలు, సూచనలు కారణంగానే తాను ఈస్థాయికి చేరగలిగానని హార్థిక్ గుర్తు చేసుకొన్నాడు. అన్నట్లు… హాకీ నేపథ్యం ఉన్న తమ కుటుంబం నుంచి వచ్చిన ఐదోతరం ఆటగాడు.. హార్థిక్ సింగ్ కావడం విశేషం.

First Published:  20 Nov 2018 8:15 AM GMT
Next Story