Telugu Global
NEWS

టీఆర్ఎస్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆయన మూడు పేజీల రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలకనేతలైన కొండా, మంత్రి మహేందర్ రెడ్డికి మధ్య గత కొంత కాలంగా తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆధిపత్యం ఎక్కువైందని…. ఎంపీనైన తనకు సరైన గౌరవం లభించట్లేదనే అసంతృప్తితో […]

టీఆర్ఎస్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా
X

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆయన మూడు పేజీల రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలకనేతలైన కొండా, మంత్రి మహేందర్ రెడ్డికి మధ్య గత కొంత కాలంగా తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆధిపత్యం ఎక్కువైందని…. ఎంపీనైన తనకు సరైన గౌరవం లభించట్లేదనే అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు చెలరేగాయి.

ఈ రూమర్ల నేపథ్యంలో ఆయన ఐదు రోజుల క్రితం టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తనకు నియోజక వర్గంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. అయినా ఆ భేటీలో అతనికి సరైన హామీ కేసీఆర్ నుంచి రాలేదని తెలుస్తోంది. భేటీ అనంతరం నాకు ఎలాంటి అసంతృప్తి లేదని కొండా విలేకరులకు వివరించారు.

ఇవాళ అనూహ్యంగా మూడు పేజీల లేఖలో తనకు ఎదురైన సాదకబాధకాలను వివరిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధినేత కేసీఆర్‌కు తెలిపారు.

అయితే ఆయన ఏ పార్టీలో చేరతారనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అయితే రెండు రోజుల్లో జరగబోయే సోనియా సభలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది.

కొండా రాజీనామాతో చేవెళ్ల పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల టీఆర్ఎస్ అభ్యర్థులపై ప్రభావం పడనున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

First Published:  20 Nov 2018 8:45 AM GMT
Next Story