Telugu Global
Cinema & Entertainment

టాక్సీవాలా 3 రోజుల వసూళ్లు

మార్కెట్లో సినిమాల్లేవ్. క్లిక్ అయిన సినిమా ఒక్కటి కూడా లేదు. సరిగ్గా టైం చూసి వచ్చింది టాక్సీవాలా. పైగా రిలీజ్ కు ముందే పైరసీ అయిందనే సింపథీ కూడా ఉంది. దానికి తోడు రిలీజైన తర్వాత కాస్తోకూస్తో పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ వసూళ్లతో దూసుకుపోతోంది. మరో ఆప్షన్ లేకపోవడం, యూత్ లో దేవరకొండకు మంచి డిమాండ్ ఉండడంతో టాక్సీవాలా దూసుకుపోతోంది. శనివారం రిలీజైన ఈ సినిమా […]

టాక్సీవాలా 3 రోజుల వసూళ్లు
X
మార్కెట్లో సినిమాల్లేవ్. క్లిక్ అయిన సినిమా ఒక్కటి కూడా లేదు. సరిగ్గా టైం చూసి వచ్చింది టాక్సీవాలా. పైగా రిలీజ్ కు ముందే పైరసీ అయిందనే సింపథీ కూడా ఉంది. దానికి తోడు రిలీజైన తర్వాత కాస్తోకూస్తో పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ వసూళ్లతో దూసుకుపోతోంది. మరో ఆప్షన్ లేకపోవడం, యూత్ లో దేవరకొండకు మంచి డిమాండ్ ఉండడంతో టాక్సీవాలా దూసుకుపోతోంది.
శనివారం రిలీజైన ఈ సినిమా నిన్నటితో 3 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఈ 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో టాక్సీవాలా సినిమాకు 8 కోట్ల 35 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఏపీ, నైజాంలో టాక్సీవాలా 3 రోజుల షేర్ ఇలా ఉంది.
నైజాం – రూ. 3.80 కోట్లు
సీడెడ్ – రూ. 1.05 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.95 కోట్లు
ఈస్ట్ – రూ. 0.48 కోట్లు
వెస్ట్ – రూ. 0.45 కోట్లు
గుంటూరు – రూ. 0.71 కోట్లు
కృష్ణా – రూ. 0.65 కోట్లు
నెల్లూరు – రూ. 0.26 కోట్లు
First Published:  20 Nov 2018 8:08 AM GMT
Next Story