Telugu Global
Cinema & Entertainment

పడి..పడి.. భలే లేచింది

శర్వానంద్-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా పడిపడి లేచే మనసు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పెద్దగా ఎవరికీ అంచనాల్లేవు. అలా బజ్ లేకుండా కిందామీద పడి సాగుతున్న ఈ సినిమా ఒక్కసారిగా పైకి లేచింది. ఈ సినిమాకు బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చింది. అది కూడా ఏకంగా 12 కోట్ల రూపాయల ఆఫర్. అవును.. పడిపడి లేచే మనసు సినిమా 12 కోట్ల డీల్ పూర్తిచేసింది. శాటిలైట్, డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్ కింద 12 […]

పడి..పడి.. భలే లేచింది
X

శర్వానంద్-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా పడిపడి లేచే మనసు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పెద్దగా ఎవరికీ అంచనాల్లేవు. అలా బజ్ లేకుండా కిందామీద పడి సాగుతున్న ఈ సినిమా ఒక్కసారిగా పైకి లేచింది. ఈ సినిమాకు బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చింది. అది కూడా ఏకంగా 12 కోట్ల రూపాయల ఆఫర్.

అవును.. పడిపడి లేచే మనసు సినిమా 12 కోట్ల డీల్ పూర్తిచేసింది. శాటిలైట్, డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్ కింద 12 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది ఈ సినిమా. అలా బడ్జెట్ లో 50శాతం ఈ మూడు హక్కుల కింద రికవరీ అయిపోయాయి. వీటిలో శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకోగా.. డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుంది.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

First Published:  21 Nov 2018 6:43 AM GMT
Next Story