Telugu Global
National

బాబు ఆహ్వానించిన యూఎన్‌ఈపీ అధిపతి ఎరిక్‌ పదవి అవుట్‌ " గార్డియన్ పత్రిక కథనం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును విదేశాల్లో కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్న సంస్థలకు, వ్యక్తులకు కాలం కలిసిరావడం లేదు. ఆ మధ్య చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తామంటూ చికాగో స్టేట్ యూనివర్శిటీ ప్రకటించింది. చంద్రబాబు మీడియా ఏకంగా షికాగో యూనివర్శిటీనే డాక్టరేట్ ఇస్తున్నట్టు ప్రచారం చేసింది. కానీ చంద్రబాబు డాక్టరేట్ ప్రకటించింది అమెరికాలోని ఒక థర్డ్ గ్రేడ్ వర్శిటీ అని ఆ తర్వాత తెలిసింది. అలా జరిగిన కొద్ది రోజులకే ఆ యూనివర్శిటీ ఏకంగా దివాలా తీసింది. దాంతో చంద్రబాబుకు డాక్టరేట్‌ కల […]

బాబు ఆహ్వానించిన యూఎన్‌ఈపీ అధిపతి ఎరిక్‌ పదవి అవుట్‌  గార్డియన్ పత్రిక కథనం
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును విదేశాల్లో కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్న సంస్థలకు, వ్యక్తులకు కాలం కలిసిరావడం లేదు. ఆ మధ్య చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తామంటూ చికాగో స్టేట్ యూనివర్శిటీ ప్రకటించింది. చంద్రబాబు మీడియా ఏకంగా షికాగో యూనివర్శిటీనే డాక్టరేట్ ఇస్తున్నట్టు ప్రచారం చేసింది. కానీ చంద్రబాబు డాక్టరేట్ ప్రకటించింది అమెరికాలోని ఒక థర్డ్ గ్రేడ్ వర్శిటీ అని ఆ తర్వాత తెలిసింది. అలా జరిగిన కొద్ది రోజులకే ఆ యూనివర్శిటీ ఏకంగా దివాలా తీసింది. దాంతో చంద్రబాబుకు డాక్టరేట్‌ కల నెరవేరలేదు.

ఇదే తరహాలో ఇటీవల చంద్రబాబుకు ప్రకృతి వ్యవసాయంపై మాట్లాడేందుకు ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానం వచ్చింది అంటూ హడావుడి జరిగింది. చంద్రబాబు కూడా అమెరికా వెళ్లి ఒక కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించి వచ్చారు. కానీ అది ప్రధాన ఐక్యరాజ్యసమితి మీటింగ్‌ కాదు అన్నది ఆ తర్వాత బయటకు వచ్చింది.

అసలు వ్యవసాయమంటే పెద్దగా ఇష్టపడని చంద్రబాబుకు ప్రకృతి వ్యవసాయంపై మాట్లాడాల్సిందిగా ఆహ్వానం ఎలా అందింది అన్న దానిపై చాలా మందిలో ఆసక్తి ఏర్పడింది. చంద్రబాబును అలా ఆహ్వానించింది…. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్‌ సోల్హెం. ఇప్పుడు ఆయన పదవి ఊడింది.

యూఎన్‌ ఎన్విరాన్‌మెంట్ విభాగం అధిపతిగా ఎరిక్‌ భారీగా అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. పత్రికల్లో భారీగా కథనాలు కూడా వచ్చాయి. విదేశీ పర్యటనల పేరుతో లక్షలాది డాలర్లను దుర్వినియోగం చేసినట్టు కూడా తేలింది. దీంతో ఎరిక్ రాజీనామా చేశారని గార్డియన్ పత్రిక వెల్లడించింది. ఇకపై తాను పదవిలో కొనసాగడం లేదని ఆయన ప్రకటించారు.

తన పదవిని ఎరిక్ సొంతానికి వాడుకున్నారన ఆరోపణలు ఉన్నాయి. గత జూన్‌లో ఎరిక్ అమరావతికి వచ్చి చంద్రబాబును కూడా కలిశారు. ఈ ఎరిక్‌తోనే నాగార్జున వర్శిటీ వద్ద ఎనిమిది కోట్లతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరీ చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఆతిథ్యానికి పడిపోయే ఎరిక్‌ చంద్రబాబును ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించేందుకు ఆహ్వానించినట్టు భావిస్తున్నారు. కానీ చివరకు ఎరిక్‌ తన పదవినే కోల్పోయారు.

First Published:  21 Nov 2018 11:50 PM GMT
Next Story