Telugu Global
NEWS

టీమిండియా-ఆస్ట్రేలియా రెండో టీ-20 మ్యాచ్ రద్దు

వానదెబ్బతో రద్దుల పద్దులో చేరిన మెల్బోర్న్ టీ-20 మెల్బోర్న్ లో కంగారూలకు టీమిండియా బౌలర్ల పగ్గాలు సిడ్నీ వేదికగా సూపర్ సండే ఆఖరి టీ-20 ఫైట్ టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ను వర్షం వెంటాడుతూనే ఉంది. బ్రిస్బేన్ వేదికగా ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ కు ..వర్షంతో అంతరాయం కలగడంతో…డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా… ఆస్ట్రేలియా 4 పరుగుల విజయం సాధిస్తే… మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ-20 మ్యాచ్ వర్షం దెబ్బతో […]

టీమిండియా-ఆస్ట్రేలియా రెండో టీ-20 మ్యాచ్ రద్దు
X
  • వానదెబ్బతో రద్దుల పద్దులో చేరిన మెల్బోర్న్ టీ-20
  • మెల్బోర్న్ లో కంగారూలకు టీమిండియా బౌలర్ల పగ్గాలు
  • సిడ్నీ వేదికగా సూపర్ సండే ఆఖరి టీ-20 ఫైట్

టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ను వర్షం వెంటాడుతూనే ఉంది.

బ్రిస్బేన్ వేదికగా ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ కు ..వర్షంతో అంతరాయం కలగడంతో…డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా… ఆస్ట్రేలియా 4 పరుగుల విజయం సాధిస్తే… మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ-20 మ్యాచ్ వర్షం దెబ్బతో ఏకంగా రద్దుల పద్దులో చేరిపోయింది.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న టీమిండియా… ప్రత్యర్థి ఆస్ట్రేలియాను… 19 ఓవర్లలో 7 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసిన సమయంలో కుండపోతగా వర్షం పడటంతో…మ్యాచ్ ను రద్దు చేసినట్లు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు.

ఇప్పటి వరకూ రెండుజట్లూ 17 సార్లు తలపడితే టీమిండియా 10 విజయాలు, ఆస్ట్రేలియా 6 విజయాల రికార్డుతో ఉన్నాయి. మరో మ్యాచ్ వర్షం దెబ్బతో రద్దుల పద్దులో చేరింది.

ఆస్ట్రేలియా గడ్డపైన ఇప్పటి వరకూ 8మ్యాచ్ లు ఆడిన టీమిండియా 4 విజయాలు, 3 పరాజయాల రికార్డుతో నిలిచింది.

సిరీస్ లోని ఆఖరి టీ-20 మ్యాచ్…సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా ఆదివారం జరుగుతుంది.

First Published:  23 Nov 2018 11:15 AM GMT
Next Story